కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు..నిరసన కార్యక్రమాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు

కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు..నిరసన కార్యక్రమాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ప్రధాన రహదారికి ట్రంప్ పేరు పెట్టడాన్ని లెప్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బుధవారం సీపీఎం ఆఫీసులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెస్లీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యాచరణ ప్రకటించాయి.

ట్రంప్ ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని, ఇందుకు పీఎం మోదీ సహకారించడం వల్ల దేశం నష్టపోతుందన్నారు. ఈ నెల 20న బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.  21న బాబూ జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రాం విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన జరపాలని నిర్ణయించారు.