న్యాయవాద వృత్తి చాలెంజింగ్ ఫీల్డ్ : వివేక్ వెంకటస్వామి 

న్యాయవాద వృత్తి చాలెంజింగ్ ఫీల్డ్ : వివేక్ వెంకటస్వామి 

ముషీరాబాద్, వెలుగు కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ స్టూడెంట్లు జూనియర్ సివిల్ జడ్జిలుగా క్వాలిఫై కావడం సంతోషంగా ఉందని విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. స్టూడెంట్స్‌‌‌‌, ఫ్యాకల్టీతోనే ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌కు మంచి పేరు వస్తుందన్నారు. లా చదవకపోయినా తాను ఎన్నో కేసులు చూశానని, ఇది చాలెంజింగ్ ఫీల్డ్ అని పేర్కొన్నారు. నలుగురు విద్యార్థులు సివిల్ జడ్జి స్థానం పొందడం ఆనందంగా ఉందన్నారు. ‘ఇండియా టుడే’ సర్వేలో కూడా కాకా లా కాలేజీకి మంచి ర్యాంకు వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

జడ్జిలుగా క్వాలిఫై అయిన మీరు.. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటూ, నిర్ణయం తీసుకునే ముందు క్లారిటీగా ఆలోచించి, న్యాయమైన తీర్పులే ఇవ్వాలని సూచించారు. కాకా డాక్టర్‌‌‌‌‌‌‌‌ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ విద్యార్థులు అనంత లక్ష్మి, అపూర్వ రవళి, రాజేశ్వర్, ఎస్వీ నాయక్ జూనియర్ సివిల్ జడ్జిలుగా క్వాలిఫై అయిన సందర్భంగా మంగళవారం కాలేజీలోని మ్యూట్ కోర్టులో ఘనంగా ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి, వినోద్, సరోజా వివేక్ హాజరై వారిని సత్కరించి అభినందించారు. 

సమాజంలో మంచి చెడులు తెలుసుకోండి..

జడ్జి అయిన తర్వాత చదువుకున్న కాలేజీని ఎప్పుడూ మర్చిపోవద్దని, ఇక్కడ చదువుతున్న లా స్టూడెంట్లకు మీ మోటివేషన్ అవసరమని సరోజా వివేక్ అన్నారు. సమాజంలో జరుగుతున్న మంచి చెడులను తెలుసుకోవాలని సూచించారు. ఇంతటి విజయం వెనక ఫ్యాకల్టీ కృషి ఎంతగానో ఉందని చెప్పారు. మొదటిసారి కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ నుంచి నలుగురు జడ్జిలుగా సెలెక్ట్ కావడం గర్వంగా ఉందని ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ జాయింట్ సెక్రటరీ రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల మేనేజ్‌‌‌‌మెంట్ డైరెక్టర్ రిషికాంత్, డాక్టర్ రత్నమాల, ప్రిన్సిపాల్ సృజన, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 

కాలేజీ సహకారం వల్లే.. 

అంబేద్కర్ లా కాలేజీ అందించిన సహకారం, కష్టపడి చదవడం వల్లే ఇది సాధ్యమైంది. క్వాలిఫై కావడానికి ఫ్యాకల్టీ ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. - ఎస్వీ నాయక్ 

ఎక్కువ టైమ్‌‌‌‌ కేటాయించా..

నన్ను ముందుకు తీసుకెళ్లింది కాకా బీఆర్ అంబేద్కర్ లా కాలేజీనే. మేడమ్ సరోజా వివేక్, ఫ్యాకల్టీ ఇచ్చిన స్ఫూర్తితో ఎక్కువ టైమ్ చదువుకే కేటాయించా. జూనియర్ సివిల్ జడ్జిగా క్వాలిఫై కావడం సంతోషంగా ఉంది. - రాజేశ్వర్ 

కాలేజీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ వల్లే సాధ్యమైంది.. 

కష్టపడి చదివా. తల్లిదండ్రులు, భర్త, కాలేజీ మేనేజ్‌‌‌‌మెంట్ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. ఫ్యాకల్టీ ఎప్పటికప్పుడు అనేక విషయాలు చెబుతూ, స్టడీ మెటీరియల్ ఇవ్వడం వల్లనే క్వాలిఫై అయ్యాను. ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నా.  : - అనంతలక్ష్మి

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

నా లైఫ్ ఇలా ఉండడానికి కారణం కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ. ఎంబీబీఎస్ చదివి మధ్యలో వదిలేశా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంబేద్కర్ లా కాలేజీలో చేరా. సక్సెస్ ఒక్క రోజులో రాలేదని గ్రహించా. కాలేజీ ఫ్యాకల్టీ వల్లే నేను క్వాలిఫై అయ్యాను. ఎంతో ఎంకరేజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది.  : - అపూర్వ రవళి