హైదరాబాద్​లో లెక్కో కుచీనా షోరూం

హైదరాబాద్​లో లెక్కో కుచీనా షోరూం

హైదరాబాద్, వెలుగు:  ఇటాలియన్ స్టైల్​ మాడ్యులర్ కిచెన్‌‌‌‌‌‌‌‌లు,  వార్డ్‌‌‌‌‌‌‌‌రోబ్‌‌‌‌‌‌‌‌లు అందించే లెక్కో కుచీనా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నాగోల్‌‌‌‌‌‌‌‌లో షోరూమ్​ను ప్రారంభించింది.   దాదాపు 2000 చదరపు అడుగుల్లో ఈ షోరూమ్ విస్తరించి ఉంది.  భారతీయ ఇండ్లకు అత్యుత్తమ ఇటాలియన్ డిజైన్ కిచెన్​లను తీసుకురావడమే తమ లక్ష్యమని లెక్కో కుచీనా తెలిపింది.

వీటిని జర్మన్ ​ఇంజనీరింగ్​ టెక్నాలజీతో తయారు చేశామని తెలిపింది. 1,2,3 బెడ్​రూమ్​ల కోసం ప్రత్యేకంగా  కాంబోలను డిజైన్​ చేశామని ప్రకటించింది. 2025 నాటికి తాము దేశమంతటా విస్తరిస్తామని వెల్లడించింది.