యూపీఐ లోన్లకు ఎగబడుతున్నరు!

V6 Velugu Posted on Jul 30, 2021

  •     నెలకు లక్షల్లో అప్లికేషన్లు వస్తున్నాయంటున్నలెండింగ్‌‌ యాప్‌‌లు
  •     వర్చువల్ క్రెడిట్‌‌ కార్డులు,  ‘బై నౌ పే లేటర్‌‌‌‌’ ఆప్షన్లతో యూపీఐ క్రెడిట్‌‌
  •     ఇటువంటి లోన్లకు ఎన్‌‌పీసీఐ అనుమతి లేదంటున్న అధికారులు
  •     ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ అకౌంట్ ఉంటేనే యూపీఐ ద్వారా అప్పు
  •     రూల్స్‌‌ పాటించకుండా లోన్లు ఇస్తున్న యాప్‌‌లు

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: ‘అప్పులివ్వడం’  కొత్తగా మారుతోంది. తాజాగా ‘యూపీఐ క్రెడిట్‌‌‌‌’ పాపులరవుతోంది. లోన్ యాప్‌‌‌‌లు కూడా యూపీఐ వర్చువల్ క్రెడిట్ కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. ‘బై  నౌ పే లేటర్‌‌‌‌‌‌‌‌’ స్కీమ్‌‌‌‌లతో కస్లమర్లకు లోన్లను ఇస్తున్నాయి.  ప్రజలు కూడా ఇటువంటి లోన్ల కోసం ఎగబడుతున్నారు. నెలకు లక్షల్లో అప్లికేషన్లు వస్తున్నాయని లోన్‌‌‌‌ యాప్‌‌‌‌లు చెబుతున్నాయి. కానీ, యూపీఐ ద్వారా అప్పులివ్వడానికి నేషనల్ పేమెంట్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌పీసీఐ) ఎప్పుడూ అనుమతివ్వలేదని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లెండింగ్ యాప్‌‌‌‌లు  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కంట్రోల్‌‌‌‌లో లేవని కూడా గుర్తుంచుకోవాలి. ‘యూపీఐ క్రెడిట్‌‌‌‌ అనే పదాన్ని డిజిటల్ లెండింగ్ యాప్‌‌‌‌లు తరచూ వాడుతున్నాయి. కానీ, యూపీఐ క్రెడిట్‌‌‌‌కు ఎన్‌‌‌‌పీసీఐ ఎప్పుడూ అనుమతివ్వలేదు. వీటిపై స్పెసిఫిక్‌‌‌‌గా ఎటువంటి రెగ్యులేషన్స్‌‌‌‌ కూడా లేవు’ అని గ్రాంట్‌‌‌‌ థార్నటన్‌‌‌‌ భారత్‌‌‌‌  పార్టనర్ వివేక్‌‌‌‌ రామ్‌‌‌‌జీ అయ్యర్ పేర్కొన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ అనుమతి ఉన్న ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌‌‌‌ సంస్థలతో  కలిసి  లెండింగ్ యాప్‌‌‌‌లు కస్టమర్లకు అప్పులిస్తున్నాయని ఆయన తెలిపారు. అంటే లెండింగ్ యాప్‌‌‌‌లు ఫ్రంట్‌‌‌‌ ఎండ్‌‌‌‌లో పనిచేస్తుంటే, ఇచ్చే లోన్లు బ్యాంకులు, ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీల బ్యాలెన్స్‌‌‌‌ షీట్‌‌‌‌లో నమోదవుతాయని చెప్పారు. 

ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్ అకౌంట్లకే యూపీఐ క్రెడిట్‌‌‌‌..

బ్యాంకుల నుంచి ఓవర్‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్‌‌‌‌ పొందిన అకౌంట్లను యూపీఐకి లింక్ చేసుకోవడానికి 2018 లో అవకాశమిచ్చారు. ఒక విధంగా యూపీఐ ద్వారా క్రెడిట్ ఇవ్వడానికి ఇదొక మార్గం. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అకౌంట్‌‌‌‌లో డబ్బులు లేకపోయిన కొంత అమౌంట్ వరకు వాడుకోవచ్చు.  ‘యూపీఐల ద్వారా క్రెడిట్‌‌‌‌ ఇవ్వడానికి అనుమతుల్లేవు. ఒకవేళ యూపీఐకి లింక్ అయిన కస్టమర్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌కు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటే యూపీఐ ద్వారా క్రెడిట్ పొందడానికి వీలుంటుంది’ అని ఎన్‌‌‌‌పీసీఐ అధికారి ఒకరు అన్నారు. కానీ, చాలా ఫిన్‌‌‌‌టెక్ కంపెనీలు తమ కస్టమర్లకు లోన్లను ఇచ్చేటప్పుడు ఇలాంటి రూల్స్ ఏవి ఫాలో కావడం లేదన్నారు. లెండింగ్ యాప్‌‌‌‌లయిన వీకార్డ్‌‌‌‌, ఫ్లెక్స్‌‌‌‌పేలు మాత్రం ఓవర్‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా యూపీఐ లోన్లను ఇస్తున్నామని ప్రకటించాయి. కానీ, చాలా మంది కస్టమర్లకు ఓవర్‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు. మరికొంత మంది ఈ ఫెసిలిటీ ద్వారా షార్ట్‌‌‌‌టెర్మ్‌‌‌‌ లోన్లను పొందడం కష్టంగా భావిస్తుంటారు. దీంతో కూడా కస్టమర్లు ఎక్కువ వడ్డీకి అయినా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో లోన్‌‌‌‌ తీసేసుకుందామని భావిస్తున్నారు. 

మరికొన్ని సమస్యలు కూడా..

యూపీఐ క్రెడిట్ ఫెసిలిటీలో మరికొన్ని  సమస్యలు కూడా ఉంటున్నాయి. యూపీఐ క్రెడిట్‌‌‌‌కు సంబంధించి చాలా ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు  క్రెడిట్‌‌‌‌ బ్యూరోలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయి. కొంత మంది కస్టమర్ల  కేవైసీ డిటైల్స్ సరిగ్గా లేకపోవడం వంటివి ఈ ఫెసిలిటీపై నెగెటివ్‌‌‌‌ ప్రభావాన్ని చూపుతున్నాయి.  యూపీఐ ద్వారా ఇచ్చే లోన్లను ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు క్రెడిట్ బ్యూరోలకు ఇండివిడ్యుల్‌‌‌‌గా రిపోర్ట్‌‌‌‌ చేస్తాయా లేదా అన్‌‌‌‌సెక్యూర్డ్ లోన్స్‌‌‌‌గా ఒకేసారి రిపోర్ట్ చేస్తాయా ? అనే విషయంపై క్లారిటీ లేదని ఇండిపెండెంట్‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌ పారిజాత్‌‌‌‌ గార్గ్‌‌‌‌ అన్నారు. చాలా లెండింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రెగ్యులేట్ చేస్తున్న సంస్థలతో సరైన ఒప్పందం లేదని తెలిపారు. చాలా సార్లు తమ బ్యాలెన్స్‌‌‌‌ షీట్‌‌‌‌ల నుంచే లోన్ యాప్‌‌‌‌లు కస్టమర్లకు అప్పు ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. యూపీఐ క్రెడిట్‌‌‌‌ను ఆఫర్ చేస్తున్న కొన్ని ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు కస్టమర్ల లోన్లను ఈఎంఐలుగా మార్చుకునే ఫెసిలిటీని ఇస్తున్నాయి.

రంగంలోని ఆర్‌‌‌‌బీఐ..

లోన్ యాప్‌‌ల వలన ఫ్రాడ్స్ జరుగుతున్నాయని కిందటేడాది వార్తలు వచ్చాయి. దీంతో దేశంలోని డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్‌‌ను  మెరుగుపరిచేందుకు ఆర్‌‌‌‌బీఐ చర్యలు తీసుకుంటోంది. దీనిపై పనిచేసేందుకు ఓ వర్కింగ్‌‌ గ్రూప్‌‌ను త్వరలో నియమించే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ లెండింగ్ యాప్‌‌లతో కలిసి పనిచేస్తున్న బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలను గమనించేందుకు ఓ టీమ్‌‌ను ఆర్‌‌‌‌బీఐ ఏర్పాటు చేస్తుందనే సమాచారం. డిజిటల్ లెండింగ్‌‌పై ఆర్‌‌‌‌బీఐ ఒక నిర్ణయానికి రావాలంటే, ప్రస్తుతం వివిధ పేమెంట్ కంపెనీలు,  ఫైనాన్షియల్ సంస్థల మధ్య టై అప్స్‌‌ను పరిశీలించాలని  ఎనలిస్టులు‌‌ సలహాయిస్తున్నారు. కానీ,  ఓవర్ రెగ్యులేషన్స్‌‌ ఉండకూదని చెబుతున్నారు. 

డిజిటల్ లోన్లకు డిమాండ్..

లోన్ యాప్‌‌లు అప్పులివ్వడం పెరుగుతోంది.  వీకార్డ్‌‌ కస్టమర్ల ప్రొఫైల్‌‌ను బట్టి రూ. 5 లక్షల వరకు లోన్‌‌ ఇస్తూ, 50 రోజుల  వరకు ఎటువంటి వడ్డీని విధించడం లేదు. ఆ తర్వాత మాత్రం 18–42 శాతం వరకు వడ్డీని వేస్తోంది. వీకార్డ్‌‌  ఆర్‌‌‌‌బీఎల్ బ్యాంక్‌‌, పినాకిల్‌‌ క్యాపిటల్‌‌, విరించి క్యాపిటల్‌‌ వంటి ఎన్‌‌బీఎఫ్‌‌సీలతో కలిసి  కస్టమర్లకు అప్పులు ఇస్తోంది. మరొక లోన్ యాప్‌‌ వివిఫై ఇండియా ఫైనాన్స్‌‌ కూడా డిజిటల్ క్రెడిట్ కార్డులను ఇష్యూ చేస్తోంది. ఫ్లెక్స్‌‌పే కింద  రూ. లక్ష వరకు లోన్‌‌ను ఇస్తోంది. క్రెడిట్ ప్రొఫైల్‌‌ను బట్టి నెలకు 36 శాతం వరకు వడ్డీని వేస్తోంది. ఆన్‌‌లైన్‌‌  క్రెడిట్ కార్డులు, ‘బై నౌ పే లేటర్‌‌‌‌’ వంటి ఆప్షన్ల ద్వారా  ఆన్‌‌లైన్ లెండింగ్‌‌కు  డిమాండ్ పెరుగుతోంది. ఒక డిజిటల్‌‌ లోన్‌‌ ప్రొడక్ట్‌‌ కోసం గతంలో నెలకు 50 వేల అప్లికేషన్లు రాగా, ప్రస్తుతం  2 లక్షలు అప్లికేషన్లు వస్తున్నాయని వివిఫై చెబుతోంది.  వీటిలో కొన్నింటికే ఆమోదం తెలుపుతున్నామని ప్రకటించింది. వీకార్డ్‌‌ కూడా తమకు నెలకు లక్షకు పైగా అప్లికేషన్లు వస్తున్నాయని, ఇందులో 2–3 వేల అప్లికేషన్లనే అనుమతిస్తున్నామని తెలిపింది. రూ. 25 వేల లోపు ఉండే లోన్లకు ఫుల్‌‌ డిమాండ్ క్రియేట్ అయ్యింది. 20‌‌‌‌17 లో ఈ లోన్లకు 10 శాతం వాటా ఉండగా, 2020 నాటికి ఇవి  60 శాతానికి పెరిగాయి. లోన్‌‌ డిస్‌‌బర్స్‌‌మెంట్‌‌లో 70 శాతం లోన్లు చిన్న సిటీల నుంచే జరుగుతోందని బ్లూమ్‌‌బర్గ్ ప్రకటించింది.

Tagged lending apps, one lakh applications, per month, UPI loans

Latest Videos

Subscribe Now

More News