గేమర్ల కోసం ఎండ్- టు- ఎండ్ కస్టమైజేషన్​

గేమర్ల కోసం ఎండ్- టు- ఎండ్ కస్టమైజేషన్​

హైదరాబాదు, వెలుగు: ఎలక్ట్రానిక్స్​ కంపెనీ లెనోవో మనదేశంలోని గేమింగ్ కస్టమర్ల కోసం ఎండ్- టు -ఎండ్ కస్టమైజేషన్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఫలితంగా కస్టమర్లు తమకు నచ్చినట్టు డెస్క్ టాప్ కంప్యూటర్లను మార్చుకోవచ్చు. ఈ బ్రాండ్ గేమింగ్ డెస్క్ టాప్ లపై పూర్తిస్థాయి కస్టమైజేషన్ అందిస్తోంది.

 కస్టమర్లు ఇక నుంచి తమ గేమింగ్ డెస్క్ టాప్ లను లీజియన్, ఎల్ఓక్యూ గేమింగ్ డెస్క్ టాప్​లుగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.  మరింత మెరుగైన పెర్ఫార్మెన్స్​ కోసం అత్యాధునిక ఇంటెల్ ఐ7 14వ జనరేషన్ వరకు ప్రాసెసర్​ను అప్​గ్రేడ్ ​చేసుకోవచ్చు. ర్యామ్​, గ్రాఫిక్​కార్డ్​, స్టోరేజీని తమ అవసరాలకు తగ్గట్టు పెంచుకోవచ్చు.