
100 మందికి ఉద్యోగాలు
కళ్లద్దాల తయారీ కంపెనీ బ్రాండ్ లెన్స్‌కార్ట్ హైదరాబాద్‌లో టెక్ సెంటర్‌ను ఓపెన్ చేసింది. ఇది వరకే ఢిల్లీ, ముంబైలో కంపెనీకి టెక్ సెంటర్లు ఉన్నాయి. వీటితో తమ ఓమ్నీచానెల్(ఆన్‌లైన్) టెక్నాలజీలో మరింత పురోగతి సాధిస్తామని, కస్టమర్లకు మరింత సమర్థంగా సేవలను అందిస్తామని తెలిపింది. రాబోయే ఆరు నెలల్లో ప్రొడక్ట్ డిజైనింగ్, ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ల కోసం 100 మందికి జాబ్స్ ఇస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఇండియాలో 700 స్టోర్లు, సింగపూర్‌లో 10 స్టోర్లు ఉన్నాయి.