
‘మాస్టర్’ మూవీ విజయం తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. పద్నాలుగేళ్ల తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 19న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నాలుగు నెలల ముందునుంచే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు.
ఫస్ట్ సాంగ్‌కు ముహూర్తం పెట్టారు మేకర్స్. ఈ నెల 22న ‘నేను రెడీ’ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ గెటప్ ఆకట్టుకుంది. చేతిలో గన్, నోట్లో సిగరెట్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, మలయాళ నటుడు మాథ్యూ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్ర్కీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.