కాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారం

కాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారం

రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తండా ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి తండా సమీపంలోని జైత్య కుంటలోకి నీటి కోసం అడవి జంతువు సాంబారు రాగా దానిపై చిరుత దాడిచేసి చంపేసింది.

 చిరుత ఇక్కడే సంచరిస్తుందని రాత్రిళ్లు భయంతో గడుపుతున్నట్లు అక్కడి వారు తెలిపారు. దాడి విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించి, సాంబారు డెడ్​బాడీని దహనం చేశారు. రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా బయట తిరగవద్దన్నారు.