
- వదిలివెళ్లిన చిరుత పులి
- ఉత్తరాఖండ్ గ్రామంలో టెన్షన్
పితోర్‌గఢ్: ఓ చిరుతపులి మూడు పిల్లలకు జన్మనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పితోర్గఢ్కు దగ్గర్లోని సిల్పటా గ్రామంలో పాడుబడిన బిల్డింగ్లో చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ బిల్డింగ్లో పశువుల మేతను నిల్వ ఉంచుతారు. సోమవారం ఉదయం గీతా దేవి అనే మహిళ మేతను తీసుకెళ్లడానికి వెళ్లి చిరుత పిల్లలను గుర్తించింది. అయితే, చిరుతపులి వాటికి దగ్గరలో ఉండొచ్చని ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగుతీసి గ్రామస్తులకు విషయం చెప్పింది.
వారు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పితోర్‌గఢ్ ఫారెస్ట్ డివిజన్ రేంజ్ ఆఫీసర్ దినేష్ జోషి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పులి మళ్లీ తన పిల్లల వద్దకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పులి దాడి నుంచి గ్రామస్తులను రక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.