కుమ్రంభీం జిల్లాలో పులుల సంచారం.. ట్రాప్ కెమెరాలతో గుర్తింపు

కుమ్రంభీం జిల్లాలో పులుల సంచారం.. ట్రాప్ కెమెరాలతో గుర్తింపు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కాగజ్ నగర్, సిర్పూర్ టి మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పెద్దపులి, చిరుత పులుల సంచారాన్ని గుర్తించడానికి అటవీశాఖ అధికారులు అడవుల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

కాగజ్ నగర్ మండలం మాలిని, దరిగం గ్రామ అటవీ ప్రాంతంలో మూడు చిరుత పులులు తిరుగుతున్నట్టు ట్రాప్ కెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తోంది. అడవిలో పులుల సంరక్షణ కోసం అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాల వల్ల మూడు చిరుత పులుల సంచారం కనిపించింది. తాము చేస్తున్న కృషి ఫలించిందని కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ అధికారులు చెప్పారు. మాలిని, దరిగాం ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.