రివిజన్ టైమ్‌లో లెసన్స్.. మరి యాన్యువల్ ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్ ఎలా?

రివిజన్ టైమ్‌లో లెసన్స్.. మరి యాన్యువల్ ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్ ఎలా?
  • యాన్యువల్ ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్ ఎలా ?
  • రివిజన్ టైమ్‌లో లెసన్స్ చెప్తున్న ఫ్యాకల్టీ
  • ఆన్‌లైన్ క్లాసుల్లో అర్థమైంది అంతంత మాత్రమే
  • స్పెషల్ స్టడీ అవర్స్‌కు పర్మిషన్ రాలే.. టెన్షన్‌లో టెన్త్ స్టూడెంట్స్ 

హైదరాబాద్, వెలుగు: టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది.  డిసెంబర్ లో పాఠాలన్నీ అయిపోయి జనవరిలో సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవాల్సిన టెన్త్  స్టూడెంట్స్ లాక్ డౌన్, కరోనా ఎఫెక్ట్ తో ఈ నెల 1న స్కూల్స్ రీఓపెన్ కావడంతో ఇప్పుడు డైరెక్ట్ క్లాసులు వింటున్నారు. లాక్ డౌన్ టైమ్ లో ఆన్ లైన్ క్లాసుల్లో  ఏం అర్థంకాకపోవడంతో ఇప్పుడు  క్లాస్ రూమ్ లో లెస్సెన్స్ పై  ఫోకస్ పెడుతున్నారు. నార్మల్ గా అయితే ఇప్పటికే టెన్త్ స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ రివిజన్ క్లాసులు, కొంచెం వెనుకబడిన స్టూడెంట్స్ కోసం స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ జరుగుతుండేవి. అయితే కోవిడ్ గైడ్ లైన్స్ కారణంగా ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ లో స్పెషల్ స్టడీ అవర్స్ లాంటివి కనిపించడంలేదు. ప్రైవేటు స్కూల్ మేనేజ్ మెంట్స్ ఏప్రిల్ లో స్టడీ అవర్స్ పెట్టేందుకు ప్లాన్ చేస్తుండగా, సర్కారు బడుల హెడ్ మాస్టర్లు గవర్నమెంట్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఎగ్జామ్స్ దగ్గరపడుతుండటం, సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన లేకపోవడంతో అటు స్టూడెంట్స్, ఇటు పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

కొన్ని నెలల ముందు నుంచే ఫోకస్

ఫైనల్ ఎగ్జామ్స్ కోసం స్కూల్ మేనేజ్ మెంట్స్ కొన్ని నెలల ముందు స్టూడెంట్స్ పై ఫోకస్ చేస్తుంటాయి. మార్నింగ్, ఈవెనింగ్  స్టడీ అవర్స్, సబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ క్లాసులు రివిజన్ చేయించడం, టెస్ట్ లు కండక్ట్ చేయడం, సబ్జెక్టులో పూర్ ఉన్న స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకోవడం లాంటివి గవర్నమెంట్, ప్రైవేటు స్కూల్స్ లో జరుగుతుంటాయి.  ఈ ఏడాది మే 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ అని గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది. అయితే స్టూడెంట్స్ కి అసలు ఆన్ లైన్ క్లాసుల ద్వారా విన్న లెసెన్స్ అర్థంకాకపోవడంతో స్కూల్ టీచర్లు మళ్లీ  స్టార్టింగ్ నుంచి ఇంపార్టెంట్ లెసెన్స్ చెప్పుకొస్తున్నారు.  గవర్నమెంట్ స్కూల్స్ కి చాలామంది స్టూడెంట్స్ ఆన్ లైన్ క్లాసులకు సరిగా అటెండ్ కాలేదు. వాళ్లకి సబ్జెక్ట్ మీద ఎలాంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ కాలేదు. ఇప్పుడు కూడా స్కూల్ కి వెళ్లి క్లాసులకు అటెండ్ అవుతున్న వారి శాతం తక్కువగానే ఉంది. దీంతో ఈసారి పాస్ పర్సెంటేజ్ 50శాతం కంటే తక్కువే ఉండొచ్చని హెడ్ మాస్టర్లు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ గైడ్ లైన్స్ లో స్పెషల్ క్లాసుల ప్రస్తావన రాకపోవడంతో తమకు తాముగా రిస్క్ తీసుకుని కండక్ట్ చేయలేమని చెప్తున్నారు. అయితే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న టైమ్ లో స్టూడెంట్స్ పరిస్థితి చూస్తే తమకూ ఆందోళన కరంగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి స్టడీ అవర్స్ కి సంబంధించి ఆదేశాలు వస్తే  కండక్ట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు.

ప్రైవేటులో 80శాతానికిపైగా  అటెండెన్స్

సిటీవ్యాప్తంగా 181 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉండగా టెన్త్  క్లాస్ లో  9,573 స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరిలో ఫస్ట్ డే 5,008  మంది స్టూడెంట్స్ (52.31శాతం) అటెండ్ అయ్యారు.  సిటీలో 1,184 ప్రైవేటు స్కూల్స్ ఉండగా..అందులో టెన్త్ స్టూడెంట్స్ 58,609 మంది ఉన్నారు. వీరిలో ఈ నెల 1న 33,925 మంది(57.88శాతం)  అటెండ్ అయ్యారు. ప్రైవేటులో డైరెక్ట్ క్లాసులకు అటెండ్ అవుతున్న టెన్త్ స్టూడెంట్స్ శాతం 80 శాతానికికి పైనే ఉంటే, సర్కారు బడుల్లో మాత్రం 40– 45శాతం దాటడంలేదు. సర్కారు బడుల్లో చదువుతున్న స్టూడెంట్స్ తమకు ఆన్ లైన్ క్లాసుల్లో ఏం అర్థంకాలేదని..డైరెక్ట్ క్లాసుల వల్ల ఇప్పుడిప్పుడే సబ్జెక్ట్ గురించి తెలుస్తోందని టీచర్లతో చెప్తున్నారు. మరోవైపు స్కూల్స్ కి రాని స్టూడెంట్స్ ఆన్ లైన్ క్లాసులకు  అటెండ్ అవుతున్నారు. మరికొందరు కొన్ని కారణాల వల్ల డెరెక్ట్, ఆన్ లైన్ క్లాసులు రెండింటికి అటెండ్ కావడం లేదు. దీంతో ఈ సారి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఎలా రాస్తోరో అని వారి పేరెంట్స్, టీచర్స్ లో టెన్షన్ నెలకొంది.

స్పెషల్ క్లాసులకు ఎలాంటి ప్లానింగ్ లేదు

గతంలో డిసెంబర్ లోనే  టెన్త్ స్టూడెంట్స్ కు అన్ని సబ్జెక్టుల క్లాసులు కంప్లీట్ అయ్యేవి. జనవరి నుంచి రివిజన్ ఉండేది. కానీ స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు సరిగా అర్థం కాకపోవడంతో  ప్రస్తుతం రివిజన్ టైమ్ లో లెసెన్స్ చెప్పాల్సి వస్తోంది. ఈసారి పాస్ పర్సెంటేజ్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.
మా స్కూల్ లో టెన్త్ స్టూడెంట్స్ 166 మంది ఉన్నారు. స్పెషల్ క్లాసులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్లానింగ్ లేదు. మాకు మేముగా స్టార్ట్ చేయాలంటే కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసినట్లు అవుతుంది. అందుకే రిస్క్ తీసుకోవడం లేదు. మరికొన్ని రోజుల్లో గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వస్తే స్పెషల్ క్లాసులు స్టార్ట్ చేస్తాం.

– నరసింహ, హెడ్ మాస్టర్, యూసుఫ్ గూడ గవర్నమెంట్ హై స్కూల్

ఇంపార్టెంట్ నోట్స్ చెప్తున్నం
ఫైనల్ ఎగ్జామ్స్ డేట్ రావడంతో ఎలా ప్రిపేర్ కావాలోనని స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ డే స్కూల్‌‌కి 50శాతం స్టూడెంట్స్ వచ్చారు. ప్రస్తుతం
90 శాతం అటెండెన్స్ ఉంటోంది. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటుండటంతో పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ పంపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మా స్కూల్‌లో స్పెషల్ క్లాసులు కండక్ట్ చేయడంలేదు. ఏప్రిల్‌లో స్టడీ అవర్స్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం.
– రమాదేవి కులకర్ణి, ప్రిన్సిపల్, స్కార్క్ హైస్కూల్, ఉప్పల్

డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నా

నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ లో వీక్.  మా ఇంటి దగ్గరలోని గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నా. ఆన్ లైన్ క్లాసులు వింటున్నప్పుడు చాలా డౌట్స్ వచ్చేవి.  ఇప్పుడు స్కూల్ కి రావడంతో డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నా. అయినా టెన్షన్ గానే ఉంది. ఫైనల్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో  తెలియడంలేదు.

– స్వప్న, టెన్త్ స్టూడెంట్, ఫిలింనగర్

For More News..

త్వరలో మార్కెట్లోకి తెలంగాణ మటన్

ఏపీకి కోటాకు మించి నీళ్లియ్యలేం

పార్టీకి సోనియాగాంధీ విరాళం ​50 వేలే