భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించండి : తమ్మినేని వీరభద్రం

భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించండి :  తమ్మినేని వీరభద్రం

భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.  ఆయన  నామినేషన్ కు ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు . భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు.  బీజేపీ గతంలో చేసిన వాగ్ధానాలు అమలు చేయలేదని విమర్శించారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు.  

బీజేపీ క్విడ్ ప్రో కో చేసిందన్నారు తమ్మినేని వీరభద్రం.  ఎలక్టోరల్ బాండ్లను సీపీఎం వ్యతిరేకించిందని చెప్పారు.   ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ  రూ.  8 వేల కోట్లు, కాంగ్రెస్ కు 2 వేల కోట్లు, బీఆర్ఎస్ 25 కోట్ల రూపాయలు భారీగా విరాళాలు వచ్చాయన్నారు.

ALSO READ | బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‪లో గొడవ స్టేజ్ పైనే ఒకరినొకరు తిట్టుకున్న నాయకులు

పార్టీ మార్పు అనేది సాధారణం అయిందన్నారు తమ్మినేని  ... అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షం నుంచి నాయకులు వెళ్తున్నారని మండిపడ్డారు.  అధికారం లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఖాళీ అవుతుందన్నారు.   వ్యాపారస్తులు ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు . దీన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.   పొత్తుతో నిమిత్తం లేదని తెలంగాణలో  సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రశంసనీయంగా ఉందన్నారు.