
మక్క రైతుల ఆందోళనకు సర్కార్ దిగొచ్చింది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొంటామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. క్వింటాల్ కు 18 వందల 50 మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొంటామన్నారు. మక్కలు సాగు చేయొవద్దని కోరినా… రైతులు మక్కల సాగు చేశారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదన్నారు సీఎం. అయినా రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు.
గత యాసంగిలో 9 లక్షల టన్నుల మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. దీనికోసం 16వందల 68 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఆ మక్కలకు బయట మార్కెట్లో ధర లేకపోవడంతోనే వేలం వేస్తే.. మార్క్ ఫెడ్ కు 845 కోట్ల నష్టం వచ్చిందన్నారు సీఎం కేసీఆర్.