న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) లోని షాక్స్‌గాం వ్యాలీలో చైనా చేపట్టిన నిర్మాణ పనులను వెంటనే ఆపాలని లడఖ్ ఎల్జీ కవిందర్ గుప్తా డిమాండ్ చేశా రు. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్‌లో భాగమేనని అన్నారు.
పీవోకే ప్రజలు కూడా భారత్‌లో కలవాలని కోరుకుంటున్నారని చెప్పారు. పాకిస్తాన్ త్వరలో ముక్కలవుతుందని ఆయన హెచ్చరించారు. ‘‘పాక్ ఆక్రమించిన షాక్స్‌గాం లోయ ప్రాంతం భారత్‌లో భాగమేనని 1994లో ఇండియన్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ప్రస్తుతం పీవోకే ప్రజలు భారత్‌లో కలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి, త్వరలోనే పాకిస్తాన్ ముక్కలవడం ఖాయం” అని గుప్తా చెప్పారు.
