ఎల్​ఐసీ  క్లెయిమ్​ సెటిల్​మెంట్​  ఈజీ  

ఎల్​ఐసీ  క్లెయిమ్​ సెటిల్​మెంట్​  ఈజీ  

హైదరాబాద్​, వెలుగు: కరోనా సెకండ్​ వేవ్​ నేపథ్యంలో పాలసీ హోల్డర్లకు క్లెయిమ్​ సెటిల్​మెంట్​ ప్రాసెస్​ను మరింత ఈజీ చేస్తున్నట్లు లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) వెల్లడించింది. కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. డెత్​ క్లెయిమ్స్​ సెటిల్​మెంట్​ను వేగంగా ముగించేందుకు ఎల్​ఐసీ కొన్ని చర్యలను ప్రకటించింది. మరణం హాస్పిటల్​లో చోటు చేసుకున్నప్పటికీ, మున్సిపాలిటీ నుంచి డెత్​ సర్టిఫికెట్​కు బదులుగా ఇతర రుజువులు (ప్రూఫ్​ ఆఫ్​ డెత్​) కూడా అంగీకరించనున్నట్లు వెల్లడించింది. డెత్​ సర్టిఫికెట్​, డిశ్చార్జ్​ సమ్మరీ, గవర్నమెంట్​, ఈఎస్​ఐ, కార్పొరేట్​ హాస్పిటల్స్​ జారీ చేసిన డెత్​ సమరీ (డేట్​, టైము సహా) సరిపోతాయని, కాకపోతే వాటిపై ఎల్​ఐసీ క్లాస్​ 1 ఆఫీసర్లు లేదా డెవలప్​మెంట్​ ఆఫీసర్లు కౌంటర్​ సిగ్నేచర్​ చేయాలని ఎల్​ఐసీ తెలిపింది.

దీంతోపాటు, క్రెమేషన్​, బరియల్​ సర్టిఫికెట్​ లేదా  సంబంధిత అధికారుల నుంచి దానిని రుజువు చేసే రశీదు ఉండాలని పేర్కొంది. మిగిలిన కేసులకు మాత్రం గతంలోలాగే మున్సిపల్​ డెత్​ సర్టిఫికెట్​ అవసరమని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్​ 31 దాకా యాన్యుయిటీస్​ రిటర్న్స్​ కోసం లైఫ్​ సర్టిఫికెట్​ ఇవ్వక్కర్లేదని ఎల్​ఐసీ స్పష్టం చేసింది.  ఈ–మెయిల్​ ద్వారా పంపే లైఫ్​ సర్టిఫికెట్స్​ను కూడా తీసుకుంటామని పేర్కొంది. లైఫ్​ సర్టిఫికెట్​ ప్రొక్యూర్​మెంట్​ కోసం  వీడియో కాల్​ ప్రాసెస్ కూడా తెచ్చామని వివరించింది. క్లెయిమ్​ సెటిల్​మెంట్​ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సర్వీసింగ్ బ్రాంచ్​లోనే కాకుండా, తమకు దగ్గర్లోని ఏ బ్రాంచ్​లోనైనా ఇచ్చే వెసులుబాటు కస్టమర్లకు కల్పిస్తున్నట్లు​​ వెల్లడించింది.