త్వరలో మెడిక్లెయిమ్ విభాగంలో ఎల్​ఐసీ ఎంట్రీ

త్వరలో మెడిక్లెయిమ్ విభాగంలో ఎల్​ఐసీ ఎంట్రీ
  • రెగ్యులేటరీ ఆమోదం కోసం ఎదురుచూపులు
  • ప్రకటించిన సంస్థ చైర్మన్​ ఎంఆర్​ కుమార్​
  • ఈ మార్కెట్లోకి ఎల్​ఐసీ వస్తే పెరగనున్న ఏజెంట్లు

ముంబయి: మనదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్​ఐసీ) మెడిక్లెయిమ్ విభాగంలోకి మళ్లీ ప్రవేశించడానికి ఆసక్తి చూపుతోంది.ఈ విషయంలో  రెగ్యులేటర్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని సంస్థ చీఫ్ ఎంఆర్​ కుమార్​​చెప్పారు. "మేము ఇప్పటికే చాలా ‘లాంగ్​ టర్మ్​ హెల్త్​ ప్రొటెక్షన్​, గ్యారంటీడ్​ హెల్త్’​ ప్రొడక్టులను అమ్ముతున్నాం. మెడికల్‌ ఇన్సూరెన్స్​ రెగ్యులేటర్  ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) ఇటీవల చేసిన సూచనను మేం పరిశీలిస్తున్నాం.

మెడిక్లెయిమ్​ సెగ్మెంట్​ మాకు కష్టం కాదు. మాకు ఇందులో చాలా అనుభవం ఉంది. నష్టపరిహారం ఆధారిత ఆరోగ్య పథకాలైన మెడిక్లెయిమ్ పాలసీలు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆరోగ్య బీమా ఉత్పత్తులు.  నష్టపరిహారం (ఇండెమ్నిటీ) ఆధారిత ఆరోగ్య పథకాలను ఉపసంహరించుకోవాలని జీవిత బీమా సంస్థలను ఐఆర్​డీఏఐ 2016లో కోరింది. అప్పటి నుంచి జీవిత బీమా సంస్థలు ‘ఫిక్స్​డ్​ బెనిఫిట్​హెల్త్​ప్లాన్స్​’ను మాత్రమే అమ్ముతున్నాయి”అని ఆయన వివరించారు. నష్టపరిహారం ఆధారిత ఆరోగ్య బీమా పథకాల కింద, బీమా చేసిన మొత్తం మేరకు ట్రీట్​మెంట్​కోసం ఖర్చు చేసిన డబ్బుకు బీమా సంస్థ రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇస్తుంది. ముందుగా నిర్ణయించిన అనారోగ్యాలు లేదా మెడికల్​ కండిషన్ల కోసం బీమా చేసిన దాంట్లో కొంతమొత్తాన్ని ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చెల్లిస్తారు.

ప్రతి ఒక్కరికీ పాలసీ..

 మనదేశంలో 2030 నాటికి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా పాలసీ ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించినందున జీవిత బీమా సంస్థలు తిరిగి మెడిక్లెయిమ్​సెగ్మెంట్లోకి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైందని ఐఆర్​డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా అన్నారు. జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా పాలసీలను అమ్మడానికి అనుమతించడం వల్ల కలిగే లాభాలు  నష్టాలను మాత్రమే స్టడీ చేస్తున్నామని, ఈ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పాండా తర్వాత స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో  జీవిత బీమా సంస్థలు ఆరోగ్య పాలసీలను అమ్ముతున్నాయి. ప్రస్తుతం దేశంలో 24.50 లక్షల మంది జీవిత బీమా ఏజెంట్లు ఉండగా, సాధారణ, ఆరోగ్య బీమా విభాగంలో 3.60 లక్షల మంది ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా రంగంలోకి అనుమతిస్తే ఏజెంట్ల సంఖ్య 600 శాతం పెరుగుతుంది. దేశంలో ఆరోగ్య బీమా వేగంగా వ్యాప్తిస్తున్నది. డెత్​ బెన్​ఫిట్​ పాలసీలు అందించే ఎల్​ఐసీ వంటివి హెల్త్​ పాలసీలను ఇవ్వడం సాధ్యం కాదని, రీయంబర్స్​మెంట్లో ఇబ్బందులు వస్తాయని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.

ఎల్ఐసీకి ఈ రంగంలోకి ఇది వరకే చాలా అనుభవం ఉంది కాబట్టి హెల్త్​పాలసీ బిజినెస్​ను నిర్వహించడం చాలా ఈజీ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే స్టాక్​ మార్కెట్లో లిస్టయిన​ లైఫ్​ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) తాజాగా ఫార్చూన్​ గ్లోబల్​ 500 లిస్టులో ప్లేస్​ పొందింది. మరోవైపు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ 51 ప్లేస్​లు ముందుకు జంప్ చేసి 104 కి చేరింది.97.26 బిలియన్​ డాలర్ల రెవెన్యూ ఉన్నఎల్​ఐసీ ఈ లిస్టులో 98వ ప్లేస్​లో నిలిచింది. లిస్టెడ్​ కంపెనీలకు మాత్రమే ఈ ర్యాంకింగ్స్​ ఇస్తారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఈ జాబితాలో గత 19 ఏళ్లుగా కొనసాగుతుండగా ఎల్​ఐసీ ఈ ఏడాదే చేరింది.