LICలో తీసుకున్న పాలసీ నచ్చకపోతెే మనీ వాపన్

LICలో తీసుకున్న పాలసీ నచ్చకపోతెే మనీ వాపన్

LIC లో తీసుకున్న పాలసీ మీకు నచ్చక పోతే చెల్లించిన పైసలు వాపస్ ఇస్తామని అంటున్నారు ఆ సంస్థ అధికారులు. ఇందుకుగాను పాలసీలో ‘ప్రీ లుక్ పీరియడ్’ ను చేర్చారు. దీంతో మీరు తీసుకున్న పాలసీ.. ఏదైనా కారణంతో నచ్చకపోయినా, వద్దనుకున్నా చెల్లించిన నగదును తిరిగి పొందవచ్చని చెప్పారు.

పాలసీ తీసుకున్నాక 15 రోజుల ‘ఫ్రీ లుక్ పీరియడ్’ ను LIC మీకు ఇస్తుంది. ఈ లోపల మీరు పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీంతో మీరు చెల్లించిన నగదును తిరిగి ఇచ్చేస్తారు. అయితే మీ చేతికి పాలసీ బాండ్ వచ్చిన 15రోజుల్లో మీ నిర్ణయం తెలపాల్సి ఉంటది. పాలసీని రిజక్ట్ చేయడానికి LIC వెబ్ సైట్ నుంచి ‘ఫ్రీ లుక్ పీరియడ్’ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి.

ఫామ్ లో మీ పాలసీ వివరాలు, ఏజెంట్ వివరాలు, పాలసీ క్యాన్సిల్ చేయడానికి గల కారణాలను తెలియజేయాలి. పాలసీ ఒరిజినల్ బాండ్, మొదటి ప్రీమియం రసీదు, క్యాన్సలేషన్ చెక్ ఆడ్ చేయాలి. దీంతో మీ నగదు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది.