ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు..తక్కువ ఆదాయ ఉన్నవారికోసం మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్

ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు..తక్కువ ఆదాయ ఉన్నవారికోసం మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్
  • జన్ సురక్షా, బీమా లక్ష్మీ లాంచ్ 

ఎల్‌ఐసీ  రెండు కొత్త ప్లాన్లు..  జన్ సురక్షా, బీమా లక్ష్మీని లాంచ్ చేసింది.   మూడు సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత ఆటో కవర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 

జన్ సురక్షా ఇది తక్కువ ఆదాయ గలవారి కోసం తెచ్చిన  మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ అని ఎల్‌ఐసీ పేర్కొంది. ప్రతీ ఏడాది యాన్యువల్ ప్రీమియంలో  4శాతం గ్యారంటీడ్ అడిషన్ ఉంటుందని తెలిపింది. ఈ పాలసీ తీసుకునే వారి  వయస్సు 18–55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలూ  ఉండకూడదు. 

పాలసీ టైమ్‌లో పాలసీహోల్డర్ చనిపోతే ఆయన ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందుతుంది. పాలసీహోల్డర్ బతికే ఉంటే పాలసీ మెచ్యూర్  అయ్యాక సమ్ అష్యూర్డ్  అందుతుంది. సమ్ అష్యూర్డ్ రూ.  లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది.  పాలసీ కాలం 12–20 ఏళ్లు.

బీమా లక్ష్మీ

ఈ పాలసీని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించామని ఎల్‌ఐసీ పేర్కొంది.  ప్రతి 2 లేదా 4 ఏళ్లకు ఫిక్స్​డ్​ మనీబ్యాక్, 7శాతం గ్యారంటీడ్ అడిషన్  అందుబాటులో ఉంది. పాలసీహోల్డర్ వయస్సు 18–50 సంవత్సరాల మధ్య ఉండాలి.  పాలసీ కాలం 25 ఏళ్లు కాగా,   ప్రీమియం చెల్లింపు 7–15 ఏళ్లు. సమ్ అష్యూర్డ్ కనీసం రూ.2 లక్షలు.