గిఫ్ట్‌‌‌‌ సిటీలో ఎల్‌‌‌‌ఐసీ ఆఫీస్‌‌‌‌

గిఫ్ట్‌‌‌‌ సిటీలో ఎల్‌‌‌‌ఐసీ ఆఫీస్‌‌‌‌

న్యూఢిల్లీ: గుజరాత్‌‌‌‌లోని గిఫ్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో  ఆఫీస్ ఓపెన్   చేయాలని ఎల్‌‌‌‌ఐసీ చూస్తోంది. విదేశాల్లోని బిజినెస్‌‌‌‌లను విస్తరించడంపై ఫోకస్ పెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ కొత్త ఆఫీస్‌‌‌‌ ఓపెన్ చేస్తామని ఎల్‌‌‌‌ఐసీ చైర్మన్‌‌‌‌ సిద్ధార్ధ మొహంతి పేర్కొన్నారు.  

బ్రాంచ్ ఆఫీస్‌‌‌‌లు, సబ్సిడరీలు, జాయింట్ వెంచర్ల ద్వారా14 దేశాల్లో సేవలందిస్తున్నామని  అన్నారు. కంపెనీ బ్రాంచ్‌‌‌‌ ఆఫీసులు ఫిజి, మారిషస్‌‌‌‌, యూకేలో ఉన్నాయి.  ఎల్‌‌‌‌ఐసీ బహ్రెయిన్‌‌‌‌, ఎల్‌‌‌‌ఐసీ నేపాల్‌‌‌‌, ఎల్‌‌‌‌ఐసీ శ్రీలంక, ఎల్‌‌‌‌ఐసీ బంగ్లాదేశ్, ఎల్‌‌‌‌ఐసీ సింగపూర్‌‌‌‌‌‌‌‌ వంటి సబ్సిడరీ కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి.