ఎల్‌‌ఐసీకి రూ. 1.7 లక్షల కోట్ల నష్టం

ఎల్‌‌ఐసీకి రూ. 1.7 లక్షల కోట్ల నష్టం

స్టాక్‌‌మార్కెట్లో భారీ నష్టాలపాలైన ఎల్ఐసీ

న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో లైఫ్‌‌ఇన్సూరెన్స్‌‌కార్పొరేషన్‌‌ఆఫ్‌‌ఇండియా(ఎల్‌‌ఐసీ) కి భారీగా నష్టం వచ్చింది.   స్టాక్‌‌మార్కెట్ల పతనంతో మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో ఎల్‌‌ఐసీ పోర్ట్‌‌ఫోలియో వాల్యూ రూ. 1.7 లక్షల కోట్లు తగ్గింది. ఎన్‌‌ఎస్‌‌ఈ డేటా ప్రకారం డిసెంబర్‌‌‌‌31,2019 నాటికి ఇండియన్‌‌ లిస్టెడ్ ‌‌కంపెనీలలో ఎల్‌‌ఐసీ ఇన్వెస్ట్‌‌మెంట్లు రూ. 6.04 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. కానీ కరోనా దెబ్బతో వీటి విలువ మార్చి 31, 2020 నాటికి రూ. 4.24 లక్షల కోట్లకు పడిపోయింది. లిస్టెడ్‌‌కంపెనీలలో ఎల్‌‌ఐసీ ఓనర్‌‌‌‌షిప్‌‌ ఆల్‌‌టైమ్ ‌‌కనిష్టం 3.88 శాతానికి తగ్గింది. జూన్‌‌, 30, 2012 లో ఈ ఓనర్‌‌‌‌షిప్ ‌‌ఆల్‌‌టైమ్‌‌హై  5 శాతాన్ని తాకింది.  ప్రభుత్వ రంగ కంపెనీలు, అప్పుల భారంతో సతమతమవుతున్న సంస్థలలో పెట్టుబడులు పెట్టడంతో కూడా కంపెనీ పోర్ట్‌‌ఫోలియో వాల్యూ భారీగా పడింది. ఇన్వెస్టర్‌‌‌‌గా ఎల్‌‌ఐసీ కి ఉన్న పొజిషన్‌‌ను ఇండియన్‌‌ మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ భర్తీ చేస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి చూస్తే ఈ కంపెనీలలో  ఇన్‌‌ఫ్లోస్‌‌ పెరుగుతుండడం గమనార్హం.

మ్యూచువల్‌‌ఫండ్స్‌‌,  ఎఫ్‌‌పీఐల పోర్ట్‌‌ఫోలియోలతో పోలిస్తే కరోనా దెబ్బతో ఎల్‌‌ఐసీ పోర్ట్‌‌ఫోలియో భారీ నష్టాలను చూసిందని ప్రైమ్‌‌డేటా బేస్‌‌గ్రూప్‌‌ఎండీ, ప్రణవ్‌‌హల్దియా అన్నారు. వీరి పోర్ట్‌‌ఫోలియోలో క్వాలిటీ స్టాకులుండడంతో నష్టాలు తగ్గాయని చెప్పారు. ఎల్‌‌ఐసీ హోల్డింగ్స్‌‌లో టాటా మోటర్స్‌‌, టాటా కెమికల్స్‌‌, ఇండియా బుల్స్‌‌హౌసింగ్‌‌, ఎడెల్వీస్‌‌ఫైనాన్షియల్‌‌, జీఐసీ హౌసింగ్, కెనరా బ్యాంక్‌‌, ఫ్యూచర్‌‌‌‌గ్రూప్‌‌, అనిల్‌‌అంబానీకి చెందిన కంపెనీలు మార్చి క్వార్టర్‌‌‌‌లో 50 శాతం నుంచి 70 శాతం వరకు నష్టపోయాయి. ఎల్‌‌ఐసీని ఈ ఏడాది స్టాక్‌‌మార్కెట్లో లిస్ట్‌‌చేయాలని ప్రభుత్వం ప్లాన్స్‌‌వేసుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ వాల్యూ రూ. 9.9 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని వాల్యుయేషన్‌‌కంపెనీ ఆర్‌‌‌‌బీఎస్‌‌ఏ అడ్వైజర్స్‌‌పేర్కొంది. మార్చి 31 నాటికి  ఎల్‌‌ఐసీ పోర్ట్‌‌ఫోలియోలో 289 లిస్టెడ్‌‌కంపెనీలున్నాయి.

For More News..

ఆర్టీసీలో సగం మంది ఎంప్లాయిస్ ఔట్?

సింగరేణి బాధితులకు రూ. 40 లక్షలు.. ఒక జాబ్