ఎల్ఐసీ న్యూ బిజినెస్​ ప్రీమియం డౌన్

ఎల్ఐసీ న్యూ బిజినెస్​ ప్రీమియం డౌన్

ముంబై: లైఫ్​ ఇన్సూరెన్స్​కార్పొరేషన్​ (ఎల్​ఐసీ) న్యూ బిజినెస్​ ప్రీమియం ఏప్రిల్​ 2023 లో  అంతకు ముందు ఏడాది ఏప్రిల్​తో పోలిస్తే  50.41 శాతం తగ్గిపోయి రూ. 5,810.10 కోట్లకు చేరింది. గ్రూప్​ సింగిల్​ ప్రీమియం భారీగా తగ్గిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది ఏప్రిల్​తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్​ నెలలో మొత్తం లైఫ్​ ఇన్సూరెన్స్​ ఇండస్ట్రీ పొందిన న్యూ బిజినెస్​ ప్రీమియం 30 శాతం తగ్గిపోయింది.

అయితే, ఇదే సమయంలో ప్రైవేట్​ సెక్టార్ ఇన్సూరెన్స్​ కంపెనీలు మాత్రం 8.5 శాతం గ్రోత్​ రికార్డు చేయడం విశేషం. రూ. 5 లక్షలకు మించిన ఇన్సూరెన్స్​ ప్రీమియంపై ట్యాక్స్​ విధించనున్నట్లు 2023–24 బడ్జెట్​లో ప్రకటించడం లైఫ్​ ఇన్సూరెన్స్​ ఇండస్ట్రీపై పెద్ద ఎఫెక్టే చూపిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్​ అనేది జ్యుయెలరీ, పెర్​ఫ్యూమ్​ల మాదిరి లగ్జరీ ప్రొడక్టు కాదని, కాబట్టి పన్ను రిబేటు ఇవ్వాలని ఇంతకు ముందే ఎల్​ఐసీ చైర్మన్​ ఎం ఆర్​ కుమార్​ చెప్పారు. సెక్షన్​ 80 సీ ఉన్నప్పుడు అంటే 4–5 ఏళ్ల కిందటి దాకా లైఫ్​ ఇన్సూరెన్స్​ ఆకర్షణీయంగా ఉండేది.