ఎల్‌‌ఐసీ నికర లాభం రూ.9,441 కోట్లు

ఎల్‌‌ఐసీ నికర లాభం రూ.9,441 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎల్‌‌ఐసీ నికర లాభం డిసెంబర్ క్వార్టర్‌‌‌‌ (క్యూ3) లో  రూ.9,441 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.6,334 కోట్లతో పోలిస్తే  49 శాతం పెరిగింది. నెట్ ప్రీమియం ఇన్‌‌కమ్ 4.67 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్ల నుంచి రూ.1.17 లక్షల కోట్లకు ఎగసింది. షేరుకి రూ. 4 ఇంటెరిమ్‌‌ డివిడెండ్ ఇచ్చేందుకు ఎల్‌‌ఐసీ బోర్డ్ ఆమోదం తెలిపింది.

కంపెనీ గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (జీఎన్‌‌పీఏ)  రేషియో ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం  5.02 శాతం నుంచి 2.15 శాతానికి మెరుగుపడింది. కంపెనీ అసెట్స్‌‌ అండర్ మేనేజ్‌‌మెంట్‌‌ కిందటేడాది డిసెంబర్ నాటికి రూ.49.66 లక్షల కోట్లకు చేరుకుంది. 2022 డిసెంబర్ నాటికి వీటి విలువ రూ. 44.34 లక్షల కోట్లుగా ఉంది. ఇది కేవలం బిగినింగ్‌‌ మాత్రమేనని, రానున్న రోజుల్లో వివిధ ప్రొడక్ట్‌‌లను లాంచ్ చేస్తామని కంపెనీ చైర్మన్ సిద్ధార్ధ మహంతి అన్నారు. ఎల్‌‌ఐసీ షేర్లు గురువారం 6 శాతం పెరిగి రూ.1,112  వద్ద క్లోజయ్యాయి.