మానవత్వాన్ని కాపాడటమే బుద్ధుని బోధనల సారాంశం

మానవత్వాన్ని కాపాడటమే బుద్ధుని బోధనల సారాంశం
  • ఆయన మార్గాన్ని ఇండియా అనుసరిస్తుందన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : మానవత్వాన్ని రక్షించాలన్నదే బుద్ధుని బోధనల సారాంశమని ప్రధాని మోడీ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాలని కోరారు. మానవత్వాన్ని కాపాడే విషయంలో భారత్…బుద్ధిని మార్గంలో పయనిస్తుందన్నారు. గురువారం బుద్ధ పూర్ణిమ అయినప్పటికీ కరోనా కారణంగా వర్చ్యూవల్ గా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా వారియర్స్ ను గౌరవార్ధం కేంద్ర కేంద్ర సాంస్కృతిక శాఖ, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫడరేషన్ (ఐబీసీ) లు నిర్వహించినగా కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా బుద్దిని బోధనలను గుర్తుచేసుకున్నారు. బుద్ధిని అనేది అతి ప్రధానమైనదని అన్ని ధోరణులకు అదే గైడ్ గా ఉంటుందని బుద్ధుడు చెప్పారని మోడీ అన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా కృషి చేస్తూ కరోనాను జయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లుంబిని ఉద్యానవనం, బుద్దగయ సహా బౌద్ధ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని మోడీ చెప్పారు.