ఎన్‌క్లోజర్‌లోకి వచ్చిన వృద్ధుడిని ఈడ్చి పడేసిన అడవి రాజు.. గాయాలతో బయటపడ్డ వ్యక్తి

ఎన్‌క్లోజర్‌లోకి వచ్చిన వృద్ధుడిని ఈడ్చి పడేసిన అడవి రాజు.. గాయాలతో బయటపడ్డ వ్యక్తి

సింహాలు ఎంత క్రూరమైనవో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దాని కంట పడితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. అలా తప్పించుకునే అవకాశాలు 100లో 25శాతమేనని నిపుణుల అంచనా. కానీ ఓ వ్యక్తి ఏకంగా సింహం ఉన్న ఎన్ క్లోజర్ లోకి వెళ్లి, ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు.

2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ భయంకర ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహం, వ్యక్తిపై దాడి చేసే దృశ్యాలు మరోసారి తెరపైకి రావడంతో ఈ వీడియో మళ్లీ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో తబాజింబిలోని మకరేలే ప్రిడేటర్ సెంటర్‌కు బ్రిటిష్ యజమాని అయిన అప్పటి 67 ఏళ్ల హాడ్జ్.. సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అది చూసిన సింహం అతని వైపు రావడం ప్రారంభించింది. వెంటనే ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా బయటికి వచ్చేందుకు ట్రై చేశాడు. కానీ అప్పటికే సింహం.. అతని దగ్గరికి వచ్చి.. ఈడ్చివేసింది. అలా కొంతం దూరం లాక్కెళ్లింది. ఆ ధాటికి వ్యక్తి భయంతో కేకలు వేశాడు.

ఆ తర్వాత ఎలాంటి చలనం లేకుండా పడి ఉన్న ఆ వ్యక్తిపై.. సింహం దాడి చేసింది. అతని మెడ, దవడపై తీవ్రంగా గాయం చేసింది. దీన్నంతటినీ అక్కడ ఉన్న కొంతమంది చూస్తూ.. ఆందోళనకు గురయ్యారు. మరికొందరు ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అనంతరం అటవీ అధికారులు ఎలాగోలా అతన్ని కాపాడి, ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటన తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తి కోలుకున్నాడు. వీక్షకులను భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఈ వీడియో.. ప్రమాదకరమైన జంతువులకు దూరంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని మరోసారి నిరూపిస్తోంది.

https://twitter.com/TerrifyingNatur/status/1651894842048299009