మహబూబాబాద్ అర్బన్, వెలుగు: ఆపద సమయంలో పేదలకు 'లయన్స్ క్లబ్ ' అండగా ఉంటుందని క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో రావిరాల, బాలిని ధర్మారం, దుబ్బ తండా, మోదుగు తండా, మహబూబాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో వరద బాధితులు సుమారు ఐదు వందల మందికి వంట సామగ్రితోపాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ జరిగిన నష్టాన్ని ఇంటర్నేషనల్ క్లబ్ కు నివేదించి, సుమారు రూ.10 లక్షల విలువైన పది రకాల వస్తువులతోపాటు నిత్యావసర సరుకులను వరద బాధితులకు అందిస్తున్నట్టు తెలిపారు.
సరుకుల పంపిణీ కోసం మానుకోట లయన్స్ క్లబ్ నిర్వాహకులు చేసిన సేవలను కొనియాడారు. క్లబ్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి, చంద్రశేఖర్ ఆర్య, సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రావుల రవిచందర్ రెడ్డి, రమణా రెడ్డి, హరికిషన్ రెడ్డి, నాగవాణి, అశోక్ రెడ్డి, సిద్ధార్థ, పరకాల శ్రీనివాస్ రెడ్డి, పీవీ ప్రసాద్ తదితరులు
పాల్గొన్నారు.