మందుబాబులకు భారీ షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

మందుబాబులకు భారీ షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

 మద్యం ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఉపాద్యాయ నియోజకవర్గానికి ఉపఎన్నిక సందర్భంగా  మూడు రోజుల పాటు మద్యం షాపులు క్లోజ్ చేస్తున్నట్టు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ఎక్కడంటే కర్ణాటకలోని బెంగళూరులో ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీస్ కమిష్నరేట్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటల నుండి ఫిబ్రవరి 17 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయాలని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ కెఎ దయానంద ఆదేశాల జారీ చేశారు. 

ALSO READ :- రోజావే.. చిన్ని రోజావే..

 నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నిషేధించబడతాయని తెలిపారు. బెంగళూరు ఉపాధ్యాయ శాసనమండలి ఉప ఎన్నిక ఫిబ్రవరి 16న జరగనుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 1951లోని సెక్షన్ 135(సి) ప్రకారం, రూల్ 10(బి)ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.