బకాయిలు చెల్లించండి.. లేదంటే సప్లై ఆపేస్తం

బకాయిలు చెల్లించండి.. లేదంటే సప్లై ఆపేస్తం
  • సర్కార్​కు లిక్కర్ కంపెనీల లేఖ

హైదరాబాద్, వెలుగు: పెండింగ్​ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం కంపెనీలు కోరాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్పిరిట్స్‌‌ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌‌డబ్ల్యూఏఐ), బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ), కాన్ఫిడేరేషన్ ఆఫ్ ఇం డియన్ ఆల్కహలిక్ బేవరేజ్ కంపెనీస్(సీఐఏబీసీ)లు లేఖ రాశాయి. ప్రభుత్వం నుంచి రావల్సి న బకాయిలు రూ.3,366కోట్లు ఉన్నట్లు తెలి పాయి. బకాయిలు పెరిగిపోతున్నాయని, గతంలోనూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 

2024 మే నుంచి ఆగస్టు వరకు ఉన్న రూ.1,959 కోట్ల బకాయిలతో కలిపి మొత్తం రూ.3,366కోట్ల బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నాయి. 45 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చి తర్వాత చేయడం ఆపేసిందన్నారు. ఈ నెల 10 లోపు రూ.3వేల కోట్ల బకాయిలు క్లియర్ చేయాలని, లేకుంటే డిసెంబర్​లో మద్యం సరఫరా చేయలేమని తెలిపాయి.