లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను కావాలనే ఇరికించారు: కేజ్రీవాల్

లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను కావాలనే ఇరికించారు: కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫేక్ అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కావాలనే ఇరికించారని కేజ్రీవాల్ ఆరోపించారు. మనీష్ సిసోడియా పేరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జిషీట్‌లో లేదన్నారు.  800 మంది అధికారులు నాలుగు నెలలపాటు జరిపిన విచారణలో ఏమీ దొరకలేదన్నారు. 

ఢిల్లీ విద్యావిధానంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించి పరువు తీసేందుకు కుట్ర పన్నినందుకు చింతిస్తున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇద్దరు వ్యాపారవేత్తలు సహా ఏడుగురు నిందితులపై సీబీఐ శుక్రవారం తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నెం.1 నిందితుడిగా పేర్కొన్న సిసోడియా చార్జిషీట్‌లో లేదు.