OTT movies: ఈవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీలు

OTT movies: ఈవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీలు

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం వరుస సినిమాలు అలరించనున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌, జీ5 లో సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మాస్‌ మహరాజ్‌ రవితేజ, శ్రీలీల నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ధమాకా జనవరి 22న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుంది. రెండు వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత వచ్చిన ధమాకా థియేటర్లలో భారీ హిట్ కొట్టింది. 

ఇక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుర్తుందా సీతాకాలం ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ (జనవరి 21)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సత్యదేవ్, తమన్న ప్రధాన పాత్రలో నటించారు. స్టోరీలైన్ బాగున్నా.. ఈ మూవీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించలేకపోయింది.

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చత్రివాలి సినిమా రిలీజ్ రకరకాల కారణాలతో ఇప్పటి వరకు వాయిదా పడింది. ఈ మూవీని జనవరి 20న నేరుగా ఓటీటీలో (జీ5) విడుదల చేశారు. ‘స్టూడెంట్స్‌కి సెక్స్‌ ఎడ్యుకేషన్ కూడా ముఖ్యం’అనే కాన్సెప్ట్‌లో ఈ మూవీని రూపొందించారు.