దేశ వ్యాప్తంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ పెంపు

దేశ వ్యాప్తంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ పెంపు

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ దాదాపు 150 దేశాలకు వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 70 వేల మందికి ఈ వైరస్ సోకింది. దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చైనాలో 81 వేల మంది వైరస్ బారినపడగా.. 3,217 మంది మరణించారు. ఆ తర్వాత ఇటలీలో 25 వేల మందికి వైరస్ సోకింది. ఆ దేశంలో 1809 మంది మృతి చెందారు. అమెరికాలో 3600 మంది కరోనా బారినపడగా.. 69 మంది మరణించారు.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 126కి చేరినట్లు మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో ముగ్గురు మరణించగా.. 13 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మన దేశంలో రోజూ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. అయితే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ప్రస్తుతం కొంత కంట్రోల్‌లోనే ఉంది. ఇకపై కూడా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, దియేటర్లు, పార్కులు, పబ్లిక్ ఈవెంట్లు అన్ని బంద్ పెట్టాయి చాలా రాష్ట్రాలు.

విదేశాల నుంచి వచ్చే వారిని ఎప్పటికప్పుడు ఎయిర్‌పోర్టుల్లోనే స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలున్నా.. శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తున్నారు. ఇలా టెస్టులు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పర్యవేక్షణలో నడుస్తున్నాయి. వీటన్నింటికీ చీఫ్ ల్యాబొరేటరీగా పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వైరాలజీ పనిచేస్తోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో మరో పది టెస్టింగ్ సెంటర్లను పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వీటికి అదనంగా మరో 9 చోట్ల త్వరలోనే ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

ఈ ల్యాబ్స్ తెలంగాణలో రెండు ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లోని వైరాలజీ ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చోట్ల ఈ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీ కరోనా ల్యాబ్స్ వివరాలు

ఆంధ్రప్రదేశ్

1. తిరుపతి – శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ మెడికల్ సైన్స్

2. కాకినాడ – రంగరాయ మెడికల్ కాలేజీ

3. విజయవాడ – సిద్ధార్థ మెడికల్ కాలేజీ

4. అనంతపురం – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

అండమాన్ నికోబార్

5. పోర్ట్ బ్లెయిర్ – రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్

అస్సాం

6. గౌహతి – గౌహతి మెడికల్ కాలేజీ

7. దిబ్రూగఢ్ – రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్

8. సిల్చార్ – సిల్చార్ మెడికల్ కాలేజీ

9. జొర్హాట్ – జొర్హాట్ మెడికల్ కాలేజీ

బీహార్

10. పాట్నా – రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

చండీగఢ్

11. చండీగఢ్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్

ఛత్తీస్‌గడ్

12. రాయపూర్ – ఎయిమ్స్

ఢిల్లీ

13. ఢిల్లీ – ఎయిమ్స్

గుజరాత్

14. అహ్మదాబాద్ – బీజే మెడికల్ కాలేజీ

15. జామ్‌నగర్ – ఎంపీ షా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

హర్యానా

16. రోహతక్ – పండిట్ బీడీ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

17. సోనిపట్ – బీపీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

హిమాచల్‌ప్రదేశ్

18. సిమ్లా – ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ

19. కాంగ్రా – డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

జమ్ము కశ్మీర్

20. శ్రీనగర్ – షేర్ ఈ కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

21. జమ్ము – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

22. శ్రీనగర్ – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

జార్ఖండ్

23. జంషేడ్‌పూర్ – ఎంజీఎం మెడికల్ కాలేజీ

కర్ణాటక

24. బెంగళూరు – బెంగళూరు మెడికల్ కాలేజీ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

25. బెంగళూరు – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్

26. మైసూరు – మైసూర్ మెడికల్ కాలేజీ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

27. హసన్ – హసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

28. శివమొగ్గ – షిమోగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

కేరళ

29. వందనం – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్

30. తిరువనంతపురం – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

31. కోజికోడ్ – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

32. త్రిసూర్ – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

మధ్యప్రదేశ్

33. భోపాల్ – ఎయిమ్స్

34. జబల్పూర్ – నేషనల్ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్

మేఘాలయ

35. షిల్లాంగ్ – NEIGRI హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్

మహారాష్ట్ర

36. నాగ‌పూర్ – ఇందిరా గాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

37. ముంబై – కస్తూర్బా హాస్పిటల్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్

38. ముంబై – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ యూనిట్

మణిపూర్

39. ఇంఫాల్ – జేఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్

40. ఇంఫాల్ – రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  

ఒడిశా

41. భువనేశ్వర్ – రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్

పుదుచ్చేరి

42. పుదుచ్చేరి – జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

పంజాబ్

43. పటియాలా – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

44. అమృత్‌సర్ – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

రాజస్థాన్

45. జైపూర్ – సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్

46. జోధ్‌పూర్ – ఎస్.ఎన్. మెడికల్ కాలేజీ

47. ఝలావర్ – ఝలావర్ మెడికల్ కాలేజీ

48. ఉదయ్‌పూర్ – ఆర్ఎన్‌టీ మెడికల్ కాలేజీ

49. బికనేర్ – ఎప్పీ మెడికల్ కాలేజీ

తమిళనాడు

50. చెన్నై – కింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ & రీసెర్చ్

51.థేని – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

52. తిరునల్వేలి – తిరునల్వేలి మెడికల్ కాలేజీ

53. తిరువారూర్ – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

త్రిపుర

54. అగర్తలా – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

తెలంగాణ

55. సికింద్రాబాద్ – గాంధీ మెడికల్ కాలేజీ

56. హైదరాబాద్ – ఉస్మానియా మెడికల్ కాలేజీ

ఉత్తరప్రదేశ్

57. లక్నో – కింగ్స్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ

58. వారణాసి – ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బెనారస్ హిందూ యూనివర్సిటీ)

59. అలీగఢ్ – జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ

ఉత్తరాఖండ్

60. హల్ద్వానీ – గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

పశ్చిమ బెంగాల్

61. కోల్‌కతా – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంట్రిక్ డిసీజెస్

62. కోల్‌కతా – ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

———

63. న్యూఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్‌లోనూ కరోనా టెస్టులు చేస్తారు.

త్వరలో అందుబాటులోకి రాబోతున్న మరో 9 ల్యాబ్స్

బీహార్

  1. దర్భంగా – దర్భంగా మెడికల్ కాలేజీ

ఛత్తీస్‌గఢ్

2. జగదల్పూర్ – బీకే మెమోరియల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

ఢిల్లీ

3. న్యూఢిల్లీ – లేడీ హార్డింగే మెడికల్ కాలేజీ

4. న్యూఢిల్లీ – ఆర్మీ హాస్పిటల్ (ఆర్ & ఆర్)

జమ్ము కశ్మీర్

5. ఉదంపూర్ – కమాండ్ హాస్పిటల్

కర్ణాటక

6. బెంగళూరు – కమాండ్ హాస్పిటల్

మహారాష్ట్ర

7. పుణే – ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ 

తమిళనాడు

8. చెన్నై – మద్రాస్ మెడికల్ కాలేజీ

ఉత్తరప్రదేశ్

9. లక్నో – కమాండ్ హాస్పిటల్