సింగరేణి కంపెనీ లెవల్ కల్చరల్ మీట్ షురూ

సింగరేణి కంపెనీ లెవల్ కల్చరల్ మీట్ షురూ
  • మంచిర్యాల టౌన్ లో  రెండు రోజుల పాటు నిర్వహణ
  • పాల్గొన్న 220 మంది కార్మిక, ఉద్యోగ కళాకారులు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ సీఈఆర్​ క్లబ్​లో సింగరేణి కంపెనీ లెవల్​కల్చరల్​మీట్ మంగళవారం​అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజులు నిర్వహించే కంపెనీ లెవల్​మీట్​లో భజన్, గజల్, ఫోక్ ​సాంగ్స్, లైట్​మ్యాజిక్, గీత్, కీర్తన, భరతనాట్యం, కూచిపూడి, హ్యుమరస్​స్కిట్ ఆర్కెస్ట్రా, ఫోక్​డ్యాన్స్​ అంశాలపై పోటీలు జరుగనున్నాయి. ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కార్మిక, ఉద్యోగ కళాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు  ఏటా ఏరియా, రీజియన్, కంపెనీ లెవల్​లో కల్చరల్​ పోటీలు నిర్వహిస్తుందన్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలకు సంబంధించిన శ్రీరాంపూర్​,రామగుండం–1,2,3, -భూపాలపల్లి, ఇల్లందు, -మణుగూరు,కొత్తగూడెం -కార్పొరేట్​, మందమర్రి- బెల్లంపల్లికి చెందిన 220 మంది కార్మిక, కళాకారులు పోటీ పడుతున్నారు. ఇందులో గెలుపొందినవారు మహారాష్ట్రలోని నాగ్​పూర్​లోని ఈ నెల 25  జరిగే కోలిండియా కల్చరల్​ మీట్​లో పాల్గొంటారు.