వామ్మో: ఈ బుడ్డోడు మామూలోడు కాదుగా...

వామ్మో: ఈ బుడ్డోడు మామూలోడు కాదుగా...

తల్లి ప్రేమకు ఈ భూమ్మీద ఏది సాటి రాదు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే నవమాసాలు మోసి బరువు అనుకోకుండా పిల్లలకు జన్మనివ్వడమే కాదు.. ఇక పిల్లలను అనుక్షణం కాచుకుని ఉంటుంది తల్లి. మరి అలాంటి అమ్మకి ఎవరైనా ప్రమాదం తలపెడితే ఆమె పిల్లలు చూస్తూ ఉంటారా..? అంటే ఉండరు.. తల్లికి  చిన్న ప్రమాదం జరిగితే  ..ఓ  పసిబడ్డ  పిడికిలి బిగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

ఈ లోకంలో ఎలాంటి స్వార్ధం లేకుండా.. తిరిగి మన నుండి ఏది ఆశించకుండా మనకి ప్రేమని అందించే ఏకైక వ్యక్తి అమ్మ. అమ్మ ప్రేమకు హద్దు లేదు.. ఆ ఆప్యాయతకు అమృతం సాటి రాదు. అమ్మకి తన పిల్లలే ప్రపంచం. ఆ పిల్లల కోసం ఏదైనా చేస్తుంది. . 

వివరాలలోకి వెళ్తే.. 

ఒక చిన్న పిల్లవాడు తన తల్లితో కలిసి జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో ఒక కారు తన తల్లిని ఢీకొన్నది.  దీనితో ఆమె అక్కడ పడిపోయింది. తన కళ్ళ ముందే తన తల్లిని కారుతో ఢీ కొట్టినందుకు ఆ పిల్లవాడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  ఈ వీడియో _relatable_thoughts_01 అనే ఇన్ స్ట్రాగ్రామ్ యూజర్ పోస్ట్ చేయగా ... అది కాస్త వైరల్ అయింది. 

కోపంగా వెళ్లి ఆ కారును తన్నాడు. అలానే ఆ కార్ లో నుండి కిందకి దిగుతున్న వ్యక్తిని కోపంగా చూసాడు. అతనికి వార్ణింగ్ కూడా ఇచ్చాడు. చివరికి కారుతో ఢీ కొట్టిన వ్యక్తి, అక్కడ ఉన్న స్థానికులు ఆమెని పైకి లేపి కార్లో ఎక్కించారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని చూసిన వాలంతా ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.