తెలంగాణపై కేంద్రం ఎంత ఫోకస్ పెట్టినా .. బీజేపీ బలపడే అవకాశం తక్కువే : జీవన్ రెడ్డి

 తెలంగాణపై కేంద్రం ఎంత ఫోకస్  పెట్టినా .. బీజేపీ బలపడే అవకాశం తక్కువే : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్  చేశాడు.  తెలంగాణపై కేంద్రం ఎంత ఫోకస్  పెట్టిన రాష్ట్రంలో బీజేపీ బలపడే అవకాశం తక్కువేనని అన్నారు.   ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ  కవిత మీద ఆరోపణలు ఉన్నట్లు సీబీఐ అవలంబించే మెతక ధోరణి  చూస్తుంటే  బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉండే సాన్నిహిత్యం ఎంటో అర్ధం అవుతుందన్నారు.  

ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు అనడం కాదని స్వయంగా బీజేపీ నాయకులే అంటున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.  అటు పోయి ఇటు పోయి లిక్కర్  స్కామ్  కేసు మనీష్  సిసోడియా మెడకు చుట్టుకుందని చెప్పారు. కవిత జైలుకు పోతుందని అప్పట్లో బీజేపి అగ్రనేతలు తెగ మాట్లాడారని కానీ ఇప్పుడు  ఆ ఊసే లేకుండా పోయిందని  జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

జగిత్యాల మాస్టర్ ప్లాన్ కు  సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జీవో 238 తయారు చేసింది మీరే కదా అని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి నిలదీశారు.  ప్రభావిత గ్రామాల ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తెవడంతో తలొగ్గి మాస్టర్ ప్లాన్ రద్దు చేశారని ఆరోపించారు. మంచి జరిగితే క్రెడిట్ ఎమ్మెల్యేకు, చెడు జరిగితే అధికారుల మీద నెట్టడం సరికాదన్నారు.

ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవడంతో కొంతవరకు ఉపసమనం కలిగిందని జీవన్ రెడ్డి చెప్పారు. గత నాలుగున్నర సంత్సరాల నుంచి ఒక్క ప్రభుత్వ ప్లేసెస్ లో తప్ప యావర్ రోడ్ వెడల్పు చేయలేదన్నారు.  పబ్లిక్ ప్లేసెస్ ఉన్న వాటి గురించి మీరేం చర్యలు తీసుకున్నారో శ్వేత పత్రం రీలిజ్ చేయాలంటూ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.