మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారి

మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారి

కర్నాటక ఉడిపి జిల్లాలో ఓ చిన్నారి పెద్ద పులి డాన్స్ అదరగొట్టింది. పులివేషంలో సంప్రదాయ నృత్యం చేస్తున్న వ్యక్తికి దండ వేసేందుకు తల్లితో పాటు ఆ పాప కూడా వెంట వెళ్లింది. చిన్నారిని చూసిన ఆ వ్యక్తి తనతో డాన్స్ చేయమని కోరడంతో ఉత్సాహంగా స్టెప్పులేసింది. పాప డాన్స్ చూసి చుట్టుపక్కల ఉన్న జనం చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు. విజిట్ ఉడిపి పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన చిన్నారి పెద్దపులి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటి వరకు 5లక్షల మందికిపైగా జనం ఆ వీడియోను చూశారు. ఎలాంటి బెరుకులేకుండా డాన్స్ చేసిన పాపను అందరూ మెచ్చుకుంటున్నారు.

కోస్టల్ కర్నాటక ప్రాతంంలో ఏటా దసరా, కృష్ణాష్టమి పండుగల సమయంలో పులి వేషం వేసి నృత్యం చేసే సంప్రదాయం కొనసాగుతోంది. దీన్ని పిలి వేష అని పిలుస్తారు. యువకులు పెద్ద పులి వేషాలు వేసుకొని డప్పు దరువుకు అనుగుణంగా ఉత్సాహంగా డాన్స్ చేస్తారు.