వైరల్ వీడియో: దేన్ని ముట్టుకున్నా శానిటైజ్ చేసుకుంటున్న చిన్నారి

వైరల్ వీడియో: దేన్ని ముట్టుకున్నా శానిటైజ్ చేసుకుంటున్న చిన్నారి

కరోనా వ్యాప్తి ఇంకా తగ్గని నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్‌‌లు వాడటం, మాస్కులు కట్టుకోవడం తప్పనిసరిగా మారింది. దీంతో శానిటైజర్‌లు వాడటం అందరి జీవితాల్లో ఒకటిగా తయారైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాప వీడియో చూస్తే శానిటైజర్స్ మన లైఫ్‌‌లో ఎంత కీలకంగా మారాయో చెప్పొచ్చు. ఇంట్లో శానిటైజర్స్ వేసుకోవడం అలవాటైన ఓ చిన్న పాప దేన్ని ముట్టుకున్నా శానిటైజ్ చేసుకోవడాన్ని ఈ సరదా వీడయోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌‌లో ట్రెండింగ్ అవుతోంది. ఎలక్ట్రిక్ బాక్సులు, స్ట్రీట్ లైట్స్, చిన్న గోడల వద్ద ఏదైనా బాక్సులు లాంటిది కనిపిస్తే దాన్ని పాప ముట్టుకొని శానిటైజ్ చేసుకున్నట్లు చేతులను తుడుచుకోవడం ఫన్నీగా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మీమ్స్, కామెంట్స్ చేయడంతోపాటు బాగా షేర్ చేస్తున్నారు. పాప ఫస్ట్ ఇయర్ మొత్తం శానిటైజేషన్‌తోనే గడిచిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు.