
కంటెంట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపించిన చిత్రం 'లిటిల్ హార్ట్స్' . నటీనటులు కొత్తవారైనా.. కాసులు వర్షం కురిపించారు. పెద్ద చిత్రాలను సైతం బొల్తా కొట్టించి .. బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ఆ సినిమా ఏదో కాదు . థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, యూత్‌ని విశేషంగా ఆకట్టుకున్న తెలుగు చిత్రం 'లిటిల్ హార్ట్స్'. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రాబోతోంది.
ఓటీటీలోకి 'లిటిల్ హార్ట్స్'
కాలేజీ లైఫ్, టీనేజ్ ప్రేమ, పేరెంట్స్ అంచనాలు వంటి అంశాలను హాస్యం, ఎమోషన్స్ మేళవించి తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ అరంగేట్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ, ఈ క్యూట్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అయితే, సాధారణ స్ట్రీమింగ్ కాకుండా, ఈసారి 'లిటిల్ హార్ట్స్' బృందం ప్రేక్షకులకు మరింత ప్రత్యేకమైన అనుభవాన్ని అందించబోతోంది.
'ఎక్స్‌టెండెడ్ కట్'తో నవ్వుల విందు!
'లిటిల్ హార్ట్స్' సినిమాను ఓటీటీ కోసం 'ఎక్స్‌టెండెడ్ కట్' రూపంలో విడుదల చేస్తున్నట్టు 'ఈటీవీ విన్' అధికారికంగా ప్రకటించింది. అంటే, థియేటర్లలో చూడని అదనపు సన్నివేశాలు (డీలీటెడ్ సీన్స్) ఈ ఓటీటీ వెర్షన్‌లో జతకానున్నాయి. సినిమా నిడివి (రన్‌టైమ్) థియేటర్‌లో 127 నిమిషాలుగా ఉంది. కొత్తగా జతచేయబోయే ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత నవ్వును, వినోదాన్ని పంచనున్నాయి. ప్రత్యేకించి, యూట్యూబ్ స్టార్‌గా, వెబ్ సిరీస్‌లతో ప్రాచుర్యం పొందిన నటుడు మౌళి తనుజ్ ప్రశాంత్ కామెడీ టైమింగ్, ఆయన ఫ్రెండ్ జై కృష్ణ (మధు) సృష్టించే హంగామా ఈ అదనపు సన్నివేశాల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
The blockbuster rom-com of the year coming to your home…💖
— ETV Win (@etvwin) September 26, 2025
This time longer, sweeter & crazier!💞
Little Hearts (Extended Cut 🤩)
A WIN Original Production
Streaming from Oct 1 only on @etvwin @marthandsai #AdityaHasan @mouli_talks @shivani_nagaram @TheBunnyVas… pic.twitter.com/zc12LfIhQl
కథాంశం, తారాగణం
సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీలో మౌళి తనుజ్ ప్రశాంత్ (అఖిల్), శివాని నాగారం (కాత్యాయని) ప్రధాన పాత్రలు పోషించారు. ఈఎంసెట్ పరీక్షలో ఫెయిల్ అయిన అఖిల్‌ను అతని తండ్రి (రాజీవ్ కనకాల) బలవంతంగా లాంగ్-టర్మ్ కోచింగ్ సెంటర్‌లో చేర్పించడం, అక్కడ కాత్యాయనితో ప్రేమలో పడటం చుట్టూ కథ తిరుగుతుంది.
►ALSO READ | Madharaasi OTT Release: OTTలోకి 'మదరాసి' మూవీ.. నెల రోజులకు ముందే స్ట్రీమింగ్.. ఎక్కడ ఎంట్రీ ఇచ్చిందంటే?
ఈ సినిమాలో అఖిల్ తండ్రి నల్లి గోపాల్ రావుగా రాజీవ్ కనకాల నటన, కాత్యాయని తండ్రి కృష్ణకాంత్గా ఎస్.ఎస్. కాంచి నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే కామిక్ సన్నివేశాలు, టీనేజర్ల ప్రేమను డీల్ చేసే విధానం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. వీరితో పాటు సత్య కృష్ణన్, అనిత చౌదరి, నిఖిల్ అబ్బూరి కీలక పాత్రల్లో నటించారు. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి సింజిత్ యర్రమిల్లి సంగీతం అందించారు.
బ్లాక్‌బస్టర్‌గా 'లిటిల్ హార్ట్స్'
థియేటర్లలో దాదాపు రూ. 38 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు 'ఎక్స్‌టెండెడ్ కట్' రూపంలో ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇంటిల్లిపాది హాయిగా నవ్వుతూ చూసేందుకు ఈ సినిమా ఒక మంచి ఎంపిక అవుతుంది. మీరు కూడా అదనపు కామెడీతో కూడిన ఈ 'లిటిల్ హార్ట్స్' ఎక్స్‌టెండెడ్ కట్‌ను అక్టోబర్ 1 నుంచి 'ఈటీవీ విన్' లో చూడటానికి సిద్ధంగా ఉన్నారా?. థియేటర్ లో మిస్ అయిన వారికి ఇది పెద్ద శుభవార్తే మరి.