స్ట్రీమ్ ఎంగేజ్: డైనోసార్​ల సాహసాలు

స్ట్రీమ్ ఎంగేజ్: డైనోసార్​ల సాహసాలు

 డైనోసార్​ల సాహసాలు 

టైటిల్ : లిటిల్ స్టాంపర్స్ (యానిమేషన్)

డైరెక్షన్​ : ​గ్రెగ్​ రిచర్డ్​సన్

డబ్బింగ్ ఆర్టిస్ట్​ :  ఒలీవర్ డ్యుచ్​, జాషువా ఒబసి, సబ్రిన మరియెల్లె

లాంగ్వేజ్ : ఇంగ్లిష్​

ప్లాట్​ ఫాం : జియో సినిమా

మూడు రంగుల్లో ముచ్చటగొలిపే డైనోసార్​ పిల్లల స్టోరీ ఇది. అవి తమ చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని చూడటానికి బయలుదేరతాయి. ఆ సమయంలో అవి చేసే అడ్వెంచర్స్​ చూస్తూ ఎంజాయ్​ చేయొచ్చు. ఒక పక్క సాహసాలు చేస్తూనే మరో పక్క నాలెడ్జ్​ సంపాదిస్తాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ లైఫ్​లో ఉండే కష్టమైన అంశాల్ని తెలుసుకుంటాయి. చిన్నారులకు ఎంతో నచ్చే యానిమేషన్​ క్యారెక్టర్స్​తో ఈ చిట్టి కథను తెరకెక్కించారు డైరెక్టర్​. దీని రన్​ టైం 25 నిమిషాలు. కాబట్టి ఈ సినిమా సరదాగా చూడొచ్చు. ఇందులో క్యారెక్టర్స్​కి చిన్నారులు చెప్పిన డబ్బింగ్​ బాగుంది.

టామీ, అమలు లవ్​ సక్సెస్​ అయిందా!

టైటిల్ : వలట్టి ( టేల్ ఆఫ్​ టెయిల్స్)

డైరెక్షన్​ : ​దేవన్

కాస్ట్​ : విజయ్ బాబు, రఘు సుభాష్​ చంద్రన్, ఇంద్రన్స్

లాంగ్వేజ్ : మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ

ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్

టామీ, అమలు అనే రెండు కుక్కలు ప్రేమలో పడతాయి. కానీ, వాటి యజమానులు వాటి ప్రేమను అంగీకరించరు. ఆ ఇద్దరు యజమానులు వేర్వేరు మతాలకు చెందినవాళ్లు కావడమే ఇందుకు కారణం. వాళ్లలో ఒకరిది పాలక్కడ్​లో ఉండే అయ్యర్ ఫ్యామిలీ. వాళ్లు వెజిటేరియన్స్. రెండో యజమాని నాన్​వెజ్​ని ఇష్టంగా తినేవాళ్లు. అందుకని వాళ్లు పెంచుకునే కుక్కలు కూడా వాళ్ల పద్ధతిలోనే ఉండాలనుకుంటారు. కానీ... టామీ, అమలు ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేక ఇద్దరూ కలిసి పారిపోవాలి అనుకుంటారు. ఆ తర్వాత ఏమైందనేదే వలట్టి కథ. టోమీ, అమలు ప్రేమ గెలిచిందా? లేదా? తెలుసుకోవాలంటే వలట్టి : టేల్​ ఆఫ్​ టెయిల్స్ చూడాల్సిందే. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంటర్​టైన్ చేస్తుంది. ఇందులో చూపించింది జంతువుల ప్రేమ కథే అయినా, మనుషులకు పనికొచ్చే విషయాలు కూడా చెప్పారు. గ్రాఫిక్స్ లేకుండా నేచురల్​గా తీసిన ఈ సినిమాలో విజువల్​గా ఆకట్టుకుంటుంది. 

అతడు రాజ్యాన్ని కాపాడతాడా?

టైటిల్ : ది వింటర్ కింగ్

డైరెక్షన్​ : ​ఒట్టో బాతర్స్ట్​

కాస్ట్​ : లెయిన్ డి సీస్టెకర్, స్టువర్ట్​ క్యాంప్​బెల్, వాలెనె కేన్, సైమన్ మెర్రెల్స్, ఎల్లీ జేమ్స్, డేనియల్ ఇంగ్స్, నతానియేల్ మార్టెల్లో వైట్, సాగర్ ఆర్య, స్టీవెన్ ఎల్డర్

లాంగ్వేజ్ : ఇంగ్లిష్

ప్లాట్​ ఫాం : సోనీ లివ్

ఈ కథ ఫేమస్ రైటర్ బెర్నార్డ్ కార్న్​వెల్ రాసిన ‘ది వార్​లార్డ్​ క్రానికల్స్’ అనే నవల నుంచి తీసుకున్నారు. శాక్సన్స్​, దుమ్నోనియా మధ్య యుద్ధం అయిపోయినప్పటినుంచీ మొదలవుతుంది ఈ సిరీస్​. ఇందులో ఆర్థర్ పెనెడ్రాగన్ (లెయిన్ డి సీస్టెకర్) శక్తివంతమైన వీరుడు. చీకటి యుగంలో తన బ్రిటన్​ రాజ్యంలోనే బహిష్కరణకు గురైన యోధుడు ఆర్థర్. అయితే, యోధుడైన ఆర్థర్ బహిష్కరణ తర్వాత సన్యాసిగా మారిపోతాడు. అలాంటివాడు తిరిగి రాజు అవ్వడం కుదరదు. ఆ సమయంలో శాక్సన్లు దేశంపై దండెత్తుతారు. అప్పుడు పిల్లవాడు అయిన రాజు పరిపాలిస్తుంటాడు. అతనికి ఎలాంటి పవర్స్ ఉండవు. మరి ఆర్థర్ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? తిరిగి రాజు అవ్వగలిగాడా? అనేది మిగతా కథ.  పది ఎపిసోడ్లుగా తీసిన ఈ సిరీస్​లో నటించిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్​ బాగుంది. కాకపోతే ఒక్కో ఎపిసోడ్​ 50 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది.