బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. పుతిన్ హస్తం ?

బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. పుతిన్ హస్తం ?

బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్‌ట్రస్‌ ఫోన్ ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం పనిచేసే రష్యన్ ఏజెంట్లు హ్యాక్ చేశారు. ఫోన్ హ్యాక్ అయినప్పుడు లిజ్‌ట్రస్‌ బ్రిటన్ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. దీనిపై డెయిలీ మెయిల్ అనే బ్రిటన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. మిత్రదేశాలతో ట్రస్ జరిపిన చర్చలకు సంబంధించిన కీలక సమాచారాలు రష్యా చేతిలో పడి ఉండొచ్చని తెలిపింది. 

ఒక ఏడాది కాలానికి సంబంధించిన ట్రస్ సంభాషణలు, సందేశాలు పుతిన్ ఏజెంట్ల చేతికి చిక్కినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని పదవికి లిజ్ ట్రస్ పోటీ చేస్తున్న సమయంలో ఈ హ్యాకింగ్ వ్యవహారాన్ని గుర్తించారు. అయితే లిజ్ ట్రస్ వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లపై స్పందించబోమని బ్రిటన్ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర సైబర్ ముప్పులను ఎదుర్కొనే బలమై భద్రతా వ్యవస్థ ఉందని తెలిపారు.