లోన్ యాప్ వేధింపులకు ఎంసెట్ ర్యాంకర్ మృతి

లోన్ యాప్ వేధింపులకు ఎంసెట్ ర్యాంకర్ మృతి

లోన్ యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన ఎంసెట్ ర్యాంకర్ మణిసాయి విశ్రుత్ ఎం–పాకెట్ అనే లోన్ యాప్ నుంచి రుణం తీసుకున్నాడు. లోన్ కింద ఇప్పటికే 45 వేలు కట్టినా వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.

హైదరాబాద్ శంషాబాద్లో ఉంటున్న మణిసాయి విశ్రుత్.. ఈనెల 20న ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతూ చనిపోయాడు. అంత్యక్రియల కోసం సొంతూరు నగునూరుకు తరలించారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.