ఆర్​సీఎల్​ అప్పులు అమ్మనున్న ఎల్‌‌ఐసీ

ఆర్​సీఎల్​ అప్పులు అమ్మనున్న ఎల్‌‌ఐసీ

న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌) కు ఇచ్చిన అప్పులు రూ. 3,400 కోట్లను  అసెట్ రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) కి  అమ్మాలని ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ నిర్ణయించుకుంది.  ఇందుకోసం బిడ్స్ పిలవగా, ఈ బిడ్స్‌‌‌‌‌‌‌‌కు ఈ నెల 25 చివరి తేది. కాగా, దివాలా తీసిన రిలయన్స్ క్యాపిటల్  లెండర్లకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి రిలయన్స్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ను సబ్సిడరీలను కొనుగోలు చేయడానికి బిడ్స్ వేయొచ్చు.  రెండు ఇండివిడ్యువల్ సబ్సిడరీల  కోసం లేదా వివిధ కంపెనీల కోసం కలిపి బిడ్స్ వేయొచ్చు. ఈ నెల 28 లోపు రిలయన్స్ క్యాపిటల్ కోసం బైండింగ్‌‌‌‌‌‌‌‌ బిడ్స్‌‌‌‌‌‌‌‌ (కంపెనీలను కొనేటప్పుడు వేసే బిడ్స్‌‌‌‌‌‌‌‌) ను వేయాల్సి ఉంటుంది. ఈ లోపే ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ రిలయన్స్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన తన అప్పులను ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీకి అమ్మేయాలని ప్లాన్స్ వేసుకుంది. కమిటీ ఆఫ్ క్రెడిటార్ల (సీఓసీ) లో ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ కూడా మెంబరే.

బైండింగ్ బిడ్స్‌‌‌‌‌‌‌‌ చివరి తేదికి మూడు రోజుల ముందు ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల కోసం పెట్టిన డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఉండడం మిగిలిన క్రెడిటర్లు, బిడ్డర్లకు  నచ్చలేదు. కాగా, రిలయన్స్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌కు ఎనిమిది సబ్సిడరీలు ఉన్నాయి. వీటిలో జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌, సెక్యూరిటీస్ బిజినెస్‌‌‌‌‌‌‌‌, అసెట్ రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లు కీలకమైనవి. పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ డీఫాల్ట్ అవ్వడంతో  కిందటేడాది నవంబర్ 29 న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రద్దు చేసింది. వై నాగేశ్వరరావును  కార్పొరేట్ ఇన్‌‌‌‌‌‌‌‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ) చూసుకునే అడ్మినిస్ట్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించింది.  దివాలా తీసిన మూడో ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీగా రిలయన్స్ క్యాపిటల్ నిలిచింది.  శ్రేయ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్  ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ, డీహెచ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌లు  ఈ కంపెనీ కంటే ముందు ఉన్నాయి.