స్థానిక సంస్థల MLC కౌంటింగ్… కాసేపట్లో ఫలితాలు

స్థానిక సంస్థల MLC కౌంటింగ్… కాసేపట్లో ఫలితాలు

రాష్ట్రంలోని రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. కాసేపట్లో ఫలితాలు రాబోతున్నాయి.

రంగారెడ్డి

రంగారెడ్డి ఎమ్మెల్సీ కౌంటింగ్ … రాజేంద్ర నగర్ వెటర్నరీ హాస్పిటల్ లో జరుగుతోంది. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. TRS నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రేసులో ఉన్నారు. మే 31న జరిగిన ఎన్నికల్లో.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ ఓటేశారు. మొత్తం 806 ఓట్లు ఉంటే.. 797 ఓట్లు పోలయ్యాయి.

వరంగల్ 

వరంగల్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎనుమాముల మార్కెట్‌లో ప్రాధాన్యతా క్రమంలో ఓట్ల లెక్కిస్తున్నారు. మే 31న 10 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 902 మంది ఓటర్లకు గాను 883 మంది ఓటేశారు. బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచారు. TRS నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది.

నల్గొండ

ఉమ్మడి నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ మండలం దుప్పల పల్లిలోని ఎఫ్.సి.ఐ గోడౌన్స్ లో ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఉమ్మడి నల్గొండలో మొత్తం 1086 మంది ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా …1073(98.80%) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 537 ఓట్లు వచ్చిన వారు గెలవబోతున్నారు.

నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం అధికార TRS పార్టీ నుంచి తేరా చిన్నపరెడ్డి బరిలో వున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ పోటీలో వున్నారు.