ప్రజావాణి అర్జీలపై విచారణ చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణి అర్జీలపై విచారణ చేయాలి :  కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 31 ఫిర్యాదులను స్వీకరించారు. మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం కోనరావుపేట కొండ్రికర్ల గ్రామానికి చెందిన గంగ పుత్రులు తమకు న్యాయం చేయాలంటూ పెట్రోల్ డబ్బాలతో ప్రజావాణికి వచ్చారు.

గమనించిన పోలీసు సిబ్బంది కలెక్టరేట్ ప్రాంగణంలో వారిని అడ్డుకొని పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆఫీసు ఆవరణలోని గంగపుత్ర సంఘ సభ్యులు బైఠాయించి నిరసనకు దిగారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్పీ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజల నుంచి 12 అర్జీలు స్వీకరించారు. నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులతో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. వీలైనంత త్వరగా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణికి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజల నుంచి 185 దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా పరిష్కరించాలన్నారు. జిల్లా పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్పీ మహేశ్ బి.గీతే బాధితుల నుంచి 36 దరఖాస్తులు స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీవో శేషాద్రి, అధికారులు పాల్గొన్నారు.

మొక్కుబడిగా ప్రజావాణి 

మల్యాల, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి మల్యాల మండలంలో ప్రతి వారం మొక్కుబడిగా సాగుతోంది. సోమవారం 11 గంటల తర్వాత కేవలం ఒక్కరే కింది సిబ్బంది ఉన్నారు.