రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్​ రూరల్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతులకు ఎరువుల కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు యూరియా బస్తాలను బతుకమ్మగా పేర్చి నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో ఒక్క రైతు కూడా కేంద్రాల వద్ద యూరియా కోసం పడిగాపులు పడిన దాఖలాలు లేవన్నారు. రైతులు, మహిళలు, బీఆర్ఎస్​ లీడర్లు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్​ లీడర్లను అరెస్టు చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కార్యక్రమంలో కరీంనగర్, దుర్శేడ్ ప్యాక్స్ చైర్మన్లు శ్యామ్ సుందర్ రెడ్డి, తిరుపతి, లీడర్లు ఏనుగు రవీందర్ రెడ్డి, తిరుపతి నాయక్, నారాయణ పాల్గొన్నారు.

బతుకమ్మ, దసరాకు అన్ని ఏర్పాట్లు చేయాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు ప్రతీక అయిన బతకమ్మ, దసరా పండుగలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. సోమవారం మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 184 మంది లబ్ధిదారులకు రూ.41.60లక్షల సీఎంఆర్ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, శ్రీనివాస్,  ఐలేందర్ యాదవ్, లీడర్లు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.