ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, షాపులు.. డెహ్రాడూన్ అల్లకల్లోలం

ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, షాపులు.. డెహ్రాడూన్ అల్లకల్లోలం

వానలకు హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ అల్లకల్లోలం అవుతోంది. ఇటీవల వచ్చిన వర్షాలకు గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయి.. ప్రజలు నిలువనీడ లేక నిరాశ్రయులయ్యారు. కొండ చర్యలు కూలి ఇండ్లపై పడటంతో ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తీవ్రంగా నష్టపోయిన ఆ రాష్ట్రంపై వరుణ దేవుడు మరోసారి ప్రతాపం చూపాడు. సోమవారం (సెప్టెంబర్ 15) రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. మంగళావారం (సెప్టెంబర్ 16) ఉదయం మరోసారి క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. 

భారీ వరదలకు డెహ్రాడూన్ లో ఇద్దరు మిస్సయ్యారు. పెద్ద పెద్ద రాళ్లతో కూడిన వరదల కారణంగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. షాపులు కూలిపోయాయి. కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. NDRF, SDRF, PWD బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 

భారీ వరదల కారణంగా డెహ్రాడూన్ లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. సహస్రధార, డెహ్రడూన్ ఏరియాల్లో కురిసిన వర్షాలకు షాపులు, ఇండ్లూ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. 

ధ్వంసమైన డ్యాం.. నేషనల్ హైవే:

భారీ వరదలకు డెహ్రాడూన్-హరిద్వార్ నేషనల్ హైవే భారీగా కోతకు గురవ్వడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ ఫన్ వ్యాలీ, డెంటల్ కాలేజీ మధ్యలో ఉన్న డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. 

►ALSO READ | BMW కారుతో బైక్ను ఢీకొట్టీ.. పక్కనే ఆస్పత్రి ఉన్నా 19 కి.మీ. తీసుకెళ్లింది.. చికిత్స ఆలస్యం కావడంతో ఉద్యోగి మృతి

డెహ్రాడూన్-వికాస్ నగర్ రోడ్డులో ఉన్న దేవ భూమి ఇన్ స్టిట్యూట్ లో ఉన్న విద్యార్థులు నీటిలో చిక్కుకుపోయారు. దీంతో కేంద్ర బలగాలు వారిని కాపాడాయి. భారీ వర్షాలకు చంద్రభాగ నది రిశికేష్ వద్ద భయంకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇద్దరు గల్లంతైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారి కోసం కేంద్ర బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.