జర్నలిస్టులపై కేసులను ఎత్తివేయాలి : లాయక్ పాషా

జర్నలిస్టులపై కేసులను ఎత్తివేయాలి : లాయక్ పాషా

సిరిసిల్ల టౌన్, వెలుగు: జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సామల గట్టు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.