
గద్వాల టౌన్, వెలుగు: ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ మొగులయ్య తెలిపారు. సోమవారం రాత్రి గద్వాల పట్టణంలోని చింతలపేట కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 70 మంది పోలీసులు కాలనీలో 200 ఇండ్లను తనిఖీ చేశారు. కల్లు ప్యాకెట్లు, పత్రాలు లేని 28 బైక్లను సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఐ శీను, ఎస్సైలు జహంగీర్, నందికర్, శ్రీహరి, కేటీ మల్లేశ్, శ్రీనివాసులు, స్వాతి, బాలచంద్రుడు, రామకృష్ణ పాల్గొన్నారు.