రేవులపల్లి, నందిమల్ల మధ్యనే బ్రిడ్జి నిర్మించాలి...జూరాల డ్యాంపై రాస్తారోకో

రేవులపల్లి, నందిమల్ల మధ్యనే బ్రిడ్జి నిర్మించాలి...జూరాల డ్యాంపై రాస్తారోకో

గద్వాల, వెలుగు: పాత జీవో ప్రకారం రేవులపల్లి, నందిమల్ల గ్రామాల మధ్యనే హై లెవెల్  బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జూరాల డ్యాంపై రాస్తారోకో నిర్వహించారు. ఉప్పేరు, రేవులపల్లి, నందిమల్ల, నర్సన్ దొడ్డి, చింతరేవుల తదితర గ్రామాల ప్రజలు, అఖిలపక్ష కమిటీ నాయకులు సోమవారం ఉదయం జూరాల డ్యాంపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత జీవో ప్రకారం బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా, కొత్తపల్లి–ఆత్మకూరు మధ్యన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. 

ధరూరు, కేటి దొడ్డి మండలాల ప్రజలతో పాటు చాలా మందికి ఇబ్బందులు వస్తాయన్నారు. గతం నుంచి ఉన్న డిమాండ్  మేరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, వేరే ప్రాంతానికి తరలించవద్దన్నారు. అనంతరం గద్వాలకు చేరుకొని ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు.