ధాన్యం అక్రమాలపై కలెక్టర్ కు ఎమ్మెల్యే లేఖ

ధాన్యం అక్రమాలపై కలెక్టర్ కు  ఎమ్మెల్యే లేఖ

జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. కొంత మంది మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు. తరుగు పేరుతో క్వింటాల్ కు 3 కిలోల ధాన్యాన్ని అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులుకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని, అయితే వాళ్లు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్, మంత్రికి కూడా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా రైతుల తరపున ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. 

మరిన్ని వార్తల కోసం...

శబరి ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు..ఫేక్ కాల్ గా గుర్తింపు

సీఎం కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేశారు