ఇటలీలో మళ్లీ లాక్‌డౌన్‌ 

ఇటలీలో మళ్లీ లాక్‌డౌన్‌ 

కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో.. ఇటలీలో మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించింది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్‌ హాలీడే సమయాల్లో దేశంలో రెడ్‌ జోన్‌ ఆంక్షలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. షాపులు, రెస్టారెంట్లు, బార్లను మూసివేస్తున్నారు. కేవలం ఆఫీసుకు వెళ్లేవారికి మాత్రమే ట్రావెల్‌ చేసే అనుమతి ఇస్తున్నారు. హెల్త్‌, ఎమర్జెన్సీ సేవలు కూడా ఉంటాయి. క్రిస్మస్‌ పండుగ వేళల్లో చాలా స్వల్ప సంఖ్యలో అతిథులను ఆహ్వానించేందుకు అనుమతి కల్పించారు. తాము తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం సాధారణమైంది కాదని తెలిపారు ఇటలీ ప్రధాని గుసెప్పొ కాంటె తెలిపారు. క్రిస్మస్‌ వేళ కరోనా కేసులు పెరుగుతాయని నిపుణులు సూచించారని… ఈ క్రమంలో తాము లాక్‌డౌన్‌ ఆంక్షలకు ఆమోదం తెలిపినట్లు గసెప్పొ చెప్పారు.

ఈనెల 24 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు, డిసెంబర్‌ 31 నుంచి జనవరి 3 వరకు, మళ్లీ 5 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయి. రాత్రి పది నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నారు.