ఫాంహౌస్ లో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో నిఖిల్

ఫాంహౌస్ లో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో నిఖిల్

లాక్ డౌన్ వేళ.. మాజీ సీఎం కొడుకు పెళ్లి

లాక్ డౌన్ తో దేశ మొత్తం స్తంభించిపోయింది. వేసవి అంటేనే పెళ్లిళ్లతో సందడి సందడిగా సాగేది. కానీ, ఈ వేసవి మాత్రం కరోనా వల్ల తెలియకుండానే గడచిపోతోంది. కరోనా దెబ్బకు చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.

లాక్ డౌన్ వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతే.. మాజీ సీఎం కొడుకు, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, యంగ్ హీరో నిఖిల్ మాత్రం తాను కోరుకున్న అమ్మాయిని ఫాంహౌస్ లో పెళ్లి చేసుకున్నాడు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి కొడుకు నిఖిల్, మాజీ మంత్రి కృష్ణప్ప మనుమరాలు రేవతిని నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాడు. కరోనా వ్యాప్తి వల్ల సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. దాంతో మొదట అనుకున్న చోట కాకుండా.. రామనగర జిల్లా, బిదాడి సిటీలోని ఫాంహౌస్ లో శుక్రవారం వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే హాజరయ్యారు.

ముందు అనుకున్న ప్రకారం.. ఏప్రిల్ 17న మైసూరు జాతీయ రహదారిలోని రామనగరం మరియు చెన్నపట్నం మధ్య జనపదలోకాలో గ్రాండ్ గా ఈ వెడ్డింగ్ జరగాల్సి ఉంది. మార్చి 25న 21 రోజుల లాక్డౌన్ అమలు చేయబడినప్పుడు, ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేయబడుతుందని భావించి.. పెళ్లిని బెంగళూరులోని కృష్ణప్ప ఇంట్లో నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. కానీ.. మోడీ కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏప్రిల్ 14 మీడియా సమావేశం పెట్టి.. మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చేసేదేం లేక పెళ్లిని బెంగళూరు నుంచి రామనగర్ జిల్లాలోని ఫాంహౌస్ కు మార్చినట్లు సమాచారం.

ఈ పెళ్లి గురించి మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సమయంలో గుంపులుగుంపులుగా ఉండరాదని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆదేశాలున్నాయి. ఈ పెళ్లిని ఇంట్లో చేస్తే సామాజిక దూరాన్ని కొనసాగించడం చాలా కష్టం. అందుకే చాలా తక్కువ మందితో ఈ పెళ్లిని ఫాంహౌస్ లో చేస్తున్నాం. పార్టీ కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులు ఈ పెళ్లికి రావద్దు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 17న బెంగళూరులోని కృష్ణప్ప ఇంట్లోనే పెళ్లి చేయాలనుకున్నాం. కానీ, లాక్డౌన్ పొడిగించడంతో రామనగర్ లో ఈ పెళ్లి చేయాలని నిర్ణయించాం. ఇలా మార్చడానికి ముఖ్య కారణం బెంగళూరు కూడా రెడ్ జోన్ లో ఉండటమే’ అని ఆయన తెలిపారు.

For More News..

వృద్ధురాలిని చంపిన దివ్యాంగుడు.. వీడియో తీసిన పొరుగింటి వ్యక్తి

కొడుకు కోసం మూడు రోజుల్లో ఆరు రాష్ట్రాలు దాటి..